Cinema To Politics: భారత దేశంలో అత్యంత ఆదరణ పొందిన రంగాలు మూడే మూడు.. ఒకటి రాజకీయాలు, రెండు సినిమా, మూడు క్రీడలు..
ఈ మూడింటిలో ఆఖరి గమ్యం రాజకీయాలే… అందుకే క్రీడా, సినీ రంగాల్లో ఆదరణ పొందినవారంతా రాజకీయాల్లోకి
అడుగుపెడుతుంటారు. పెద్దఎత్తున ప్రజలకు మేలు చేసే అవకాశం ఉండడం, అధికార దర్పం.. చరిత్రలో
నిలిచిపోయే వీలుండడంతో ముఖ్యంగా సినీ తారలు రాజకీయాల్లోకి వస్తుంటారు.
తమిళనాట అత్యధికం తెలుగు నేలన రికార్డు Cinema To Politics…
Cinema To Politics:
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన హీరో ఎవరంటే అన్న దివంగత నందమూరి తారక రామారావు. నవరస నటనా
సార్వభౌముడిగా.. తెలుగు వారి రాముడు, క్రిష్ణుడిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్. అదే ప్రజాదరణతో రాజకీయాల్లోకి వచ్చి..
తెలుగు దేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఈ ప్రపంచ రికార్డు ఇప్పటికీ కొనసాగుతోంది.
తెలుగువారికి ఎన్టీఆర్ ఎలాగో.. తమిళులకు ఎంజీఆర్ అలా. రాజకీయంగా అత్యంత చైతన్యవంతులైన అరవ ప్రజలు..
ఎంజీఆర్ లో ఓ మహా నాయకుడిని చూశారు. డీఎంకే వంటి పార్టీని వీగి ఏఐడీఎంకేను స్థాపించిన వెంటనే పట్టం కట్టారు.
1977-87 మధ్యన ఎంజీఆర్ పదేళ్లు సీఎంగా పనిచేశారు. కేవలం 60 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.
మరికొన్నాళ్లు బతికుంటే చరిత్రను మలుపుతిప్పేవారు.
ఎంజీఆర్ మరణం అనంతరం ఆయన పార్టీ సినీ రంగానికే చెందిన హీరోయిన్ జయలలిత చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
అలా.. చరిత్రను ఇంకో విధంగా మలుపుతిప్పారు. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయలలిత సీఎంగా సుదీర్ఘ కాలం
పాలించి రికార్డులకెక్కారు.
తమిళులకే కాదు.. యావత్ భారతదేశానికి కూడా గర్వకారణమైన నటుడు ఎవరంటే కమల్ హాసన్.
విశ్వనాయకుడిగా కీర్తిగడించిన ఆయన రాజకీయాల్లోనూ నాయకుడిగా ఎదగాలని భావించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
మక్కల్ నీది మయ్యం పేరిట పార్టీని స్థాపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో పోటీ చేసినా ఫలితం పొందలేకపోయారు.
ఇక కమల్ సహ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం రాజకీయాల్లోకి వద్దామని ప్రయత్నించి..
చివరకు ఆరోగ్య కారణాల రీత్యా తప్పుకొన్నారు. వాస్తవానికి ఎంజీఆర్ తర్వాత రజనీ పార్టీకే అత్యంత
ఆదరణ దక్కే పరిస్థితులు ఉన్నా.. ఆయన ప్రయత్నాన్ని విమరించుకోవడంతో ఫలితం దక్కలేదు.
ఎంజీఆర్ నుంచి నల్ల ఎంజీఆర్
ఇటీవల చనిపోయిన విజయకాంత్ కూడా సొంతంగా పార్టీని స్థాపించి దాదాపు 18 ఏళ్లు తమిళ రాజకీయాల్లో కొనసాగారు.
ఎండీఎంకే ఆయన పార్టీ పేరు. సత్వర ఫలితాన్ని ఆశించకుండా, ఓటమిని స్వీకరిస్తూ ముందుకుసాగిన విజయకాంత్
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎలా ఉంటాయో చూశారు. గత నెలలో ఆయన చనిపోయేవరకు ఎండీఎంకే సారథ్యం
చూసుకున్నారు. ప్రస్తుతం విజయకాంత్ భార్య ఎండీఎంకే అధ్యక్షురాలిగా ఉన్నారు.
చిరు.. పవన్..Cinema To Politics…
తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ఓ చరిత్ర అయితే.. ఆయన తర్వాత అంతే స్థాయిలో జనాదరణ
పొందిన హీరో మెగాస్టార్ చిరంజీవి. 30 ఏళ్ల స్టార్ డమ్ ను వదులుకుని 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు చిరంజీవి.
ఉమ్మడి ఏపీలో 2009 ఎన్నికల్లో 17 సీట్లకే పరిమితం అయినా.. 70 లక్షల ఓట్లు సాధించారు. అప్పటికి ఉన్న ఓట్ల
లెక్కల ప్రకారం ప్రతి ఐదు ఓట్లలో ఒకటి దక్కించుకున్నారు. అయితే, 2010లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
మరోవైపు చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2014లో జనసేన పేరిట పార్టీని స్థాపించి విభజిత ఏపీలో కీలక
భూమిక పోషిస్తున్నారు. పదేళ్లుగా పార్టీని కొనసాగిస్తూ.. అవమానాలకు ఎదురునిలుస్తూ ముందుకెళ్తున్న పవన్..
వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. కాగా, అన్న ఎన్టీఆర్ మరణానంతరం ఆయన కుమారుడు హరిక్రిష్ణ
‘‘అన్న ఎన్టీఆర్’’ పేరిట పార్టీని స్థాపించినా ఆ తర్వాత ముందుకుసాగలేకపోయారు. కన్నడ నాట
హీరో ఉపేంద్ర నిరుడు రాజకీయ పార్టీని స్థాపించారు. మలయాళంలో మాత్రం సొంతంగా పార్టీని స్థాపించిన
హీరోలు ఎవరూ లేనట్లుగా తెలుస్తోంది.Cinema To Politics.
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?