హైదరాబాద్ గల్లీ గల్లీ తెలిసిన పోరడు హీరో అవ్వాలి అని కలకన్నాడు….
ఆ కల నెరవేర్చుకోవటం కోసం ఎన్నో సినిమా ఆఫీసుల్లో ఎంతోమంది దగ్గర అవకాశం ఇస్తారని నమ్మకంతో వాళ్లు ఏ పని చెప్తే ఆ పని చేశారు.
మొదట నువ్వే ఫస్ట్‌లీడ్ అనేవారు, తర్వాత అతను సెకండ్ లీడ్ అయ్యేవాడు.
ఏదో ఒకటిలో అనుకుని సర్దుకుని హీరో కదా అనుకునే ఆ కుర్రోడికి మరో నాలుగు రోజుల్లో మూడోలీడ్, నాలుగో లీడ్ అయ్యేవాడు.
ఫైనల్‌గా ఆ ప్రాజెక్ట్‌లో నువ్వులేవు అనేసేవారు. అంతే ఆ కుర్రోడు గుండె పగిలింది.
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని రెండురోజులపాటు ఏడుస్తూనే ఉన్నాడు.
లాభం లేదనుకుని తనే మెగా ఫోన్ పట్టుకుంటేనే తనను తాను హీరోగా మలుచుకోగలను లేదంటే ఇండస్ట్రీలో ఉండను అనుకుని ఓ నిర్ణయానికొచ్చేశాడు…
అతను మెగాఫోన్ పట్టుకున్న సినిమా పేరు ‘ఫలక్‌నామా దాస్’ ఆ హీరో పేరు విష్వక్‌సేన్.
డైరెక్టర్‌గా ఓకే అన్నారంతా..హీరోగా మాత్రం చాలా సినిమాలు ఆఫర్లు రావటంతో ఆ కుర్రోడు అనుకున్న గోల్ కొట్టేశాడు.
కట్‌చేస్తే తక్కువటైమ్‌లోనే 14 సినిమాల్లో నటించారు.
ప్రస్తుతం ‘లైలా’ సినిమాతో లేడి గెటప్‌లో ఎంట్రీఇచ్చి భలేఉంది…ఎవరి అమ్మాయి అని ఆశ్యర్యపోయోలా చేశాడు విష్వక్.
ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే రోజున సినిమాని విడుదల చేస్తున్నాడు.
ఈ సినిమాతో తను లేడి గెటప్‌లో రెడీ అవ్వటానికి ఒక్కో రోజు మేకప్‌కి రెండున్నర గంటలు పట్టేదట.
ఈ ఒక్క సినిమాతో ఆడాళ్లు మీకు జోహార్లు అంటున్నారు లైలా హీరో.
‘లైలా’ విశేషాలతో పాటు తన లైఫ్‌లోని అనేక టాపిక్స్‌ని ట్యాగ్‌తెలుగుకి ప్రత్యేకంగా ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో తెలియచేశారు విష్యక్‌సేన్. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : తండేల్ నా బ్రెయిన్ చైల్డ్– కార్తీక్ తీడా
