అన్‌ కాంప్రమైజ్డ్‌ పర్సనాలిటీ శేఖర్‌ కమ్ములది…

బర్త్‌డే స్పెషల్‌ స్టోరీ ఎబౌట్‌ శేఖర్‌….

డైరెక్టర్‌– రైటర్‌– ప్రొడ్యూసర్‌ మూడు అతనే..
అదేంటి అవి మూడూ మూడు విభాగాలు కదా..
మరి మూడు అతనే ఎందుకు…ఎందుకంటే అతను శేఖర్‌..
శేఖర్‌ అయితే మూడు చేస్తాడా.. శేఖర్లందరూ చేయలేరు..
శేఖర్‌ కమ్ముల మాత్రం చేయగలడు..
ఎందుకంటే అతను బాగా చదువుకున్న సంస్కారి..
ఎథిక్స్‌ తెలిసిన సాప్ట్‌వేర్‌ ఇంజనీరు..
తన భవిష్యత్తు ఎక్కడో ఉందో ముందే తెలిసిన జ్ఞాని..
అందుకే సినిమా తీయాలని తనకున్నా..సినిమా తన ప్యాషనైనా
ఎవరో డబ్బులు పెట్టి సినిమా తీస్తే తన కోరిక తీరాలి అనుకోలేదు అతను..
ఎందుకంటే అతను చదువుకున్నాడు..
డబ్బువిలువ తెలుసతనికి..అందుకే ఎవరి కష్టమో తనకువద్దు..
తన కష్టంతో సంపాదించిన డబ్బుతో చేస్తే అది కదా మజా అనుకున్నాడు..
అందుకే అమెరికా పోయి కొలువులో చేరి రూపాయిల్ని జమచేశాడు..
ఆ డబ్బుతో తన కళ్లముందు జరుగుతున్న తతంగాన్ని సినిమాగా మలిచాడు..ఆ సినిమానే ‘డాలర్‌ డ్రీమ్స్‌’..
అప్పుడు.. తన పేరును సినిమాలో సిల్వర్‌స్కీన్‌పై
గర్వంగా డైరెక్టర్‌– రైటర్‌– ప్రొడ్యూసర్‌ శేఖర్‌ కమ్ముల…
అని గుండెల్లో ఎన్నోసార్లు రాసుకున్న పేరును…
సినిమా పూర్తయ్యాక 70 యంయం స్క్రీన్‌పై వేసుకున్నాడు…
చేతులు కాలాయి..అందరు బావుంది అంటున్నారు ..
కలెక్షన్లు మాత్రం పెద్దగా కళ్ల చూల్లేదు..
డాలర్లను రూపాయలుగా మార్చి లెక్కచేయకుండా
సినిమాకోసం ఖర్చు పెడితే రూపాయి కూడా రాలేదు..
కష్టమంతా వృధా అయ్యింది…
కానీ తర్వాత ఏడాది ప్రకటించిన నేషనల్‌ అవార్డ్సులో
నేషనల్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ న్యూ డైరెక్టర్‌ గోస్‌ టు శేఖర్‌ కమ్ముల..
ఫర్‌ ది ఫిల్మ్‌ ‘డాలర్‌ డ్రీమ్స్‌’ అని ఎనౌన్స్‌ అవ్వగానే..కష్టమంతా గాల్లోకి ఎగిరిపోయింది…మళ్లీ సినిమా తీయాలి అనే ఆశ..
నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెరమీద బొమ్మ…సినిమా పేరు ‘ఆనంద్‌’..దాదాపు అందరూ కొత్తవాళ్లతోనే…
కట్‌ చేస్తే విడుదలరోజు…ఎదురుగా చిరంజీవి గారి శంకర్‌దాదా యంబిబియస్‌..ఆయన సినిమాకి వచ్చే ఓవర్‌ఫ్లోతో సినిమాకి కలెక్షన్లు వస్తాయేమో అని కల…
శంకర్‌దాదా..400పై చిలుకు థియేటర్లలో విడుదలయ్యింది..
ఆనంద్‌ సినిమా కేవలం 4 సెంటర్లలో విడుదలయ్యింది..
ఆ సినిమాలు విడుదలయ్యింది శేఖర్‌ తలరాతను మార్చింది..
అదే రోజు..ఆ రోజు 15. అక్టోబర్‌ .2004..కల నిజమయ్యింది
చిన్నగా ఒక్కో థియేటర్‌ పెరగటం స్టార్టయ్యింది..
వందలకొద్ది థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది..
‘ఆనంద్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌ అయ్యింది..
ఇదే ఊపులో ‘గోదావరి’ సినిమా వచ్చింది..హిట్‌ అయ్యింది..
ఈసారి చాలా స్పీడ్‌గా ‘హ్యాపీడేస్‌’ వచ్చింది..బ్లాక్‌బస్టర్‌
తర్వాత ‘లీడర్‌’ విడుదలయ్యింది..మంచి సినిమా అన్నారు..
‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనే సినిమా వచ్చింది..బ్యూటిఫుల్‌ ఫిల్మ్‌
అప్పటివరకు అన్ని ఆయన కథలే..
తొలిసారి ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని హిందీ నుండి కథను అప్పుగా తీసుకుని ‘అనామిక’గా తీశారు శేఖర్‌..
రిజల్ట్‌తో ఇబ్బంది పడ్డారాయన..మంచి చెప్తే చూడట్లేదని…
మూడేళ్ల తర్వాత ‘ఫిదా’ అన్నారు…
మరో నాలుగేళ్ల తర్వాత ‘లవ్‌స్టోరీ’ అన్నారు శేఖర్‌..
రెండు సినిమాలను లవ్‌చేసి ఫిధా అయ్యారు ప్రేక్షకులు..
ఇప్పటివరకు శేఖర్‌ జర్నీ అంతా ఒకెత్తు..
‘కుబేరా’ నుండి మరో ఎత్తులాగా ముందుకెళ్తున్నారు శేఖర్‌..

అది ఎలా అంటే…

శేఖర్‌ కమ్ముల ప్రతి సినిమాకి కథ– దర్శకత్వం శేఖర్‌ కమ్ముల అని ఉంటే కెమెరా– విజయ్‌ .సి. కుమార్‌ అని, ఎడిటర్‌– మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ అని ఉండేది.

ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌ ఆఫ్‌ హిస్‌ కెరియర్‌ ఆ రెండు పేర్లు ఈ సినిమాతో మారుతున్నాయి.

అందుకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటి అందరితో పాటు నాకు ఉంది….చూడాలి ఏం అవుతుందో..

25 ఏళ్ల శేఖర్‌ కమ్ముల జర్నీలో ఎక్కడా ఎవరికి కాంప్రమైజ్‌ అయ్యిందే లేదు..అవ్వరు కూడా…అలాంటి వ్యక్తి శేఖర్‌..

ఫిబ్రవరి 4 ఆయన పుట్టినరోజు..ఈ పుట్టినరోజు ఆయనకెంతో స్పెషల్‌ తొలిసారిగా ఇద్దరు స్టార్స్‌తో జర్నీ చేస్తున్నారాయన..

కుబేర పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

శేఖర్‌ కమ్ములగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్‌…

శివమల్లాల

Also Read This : మంచు విష్ణు కొడితే కుంభస్థలం కొట్టాలి అనుకున్నాడేమో ..అందుకే ప్రభాస్‌తో..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *