మ్యాజిక్‌ ఫుల్‌ మరి లాజిక్‌ మాటేంటి?

రివ్యూ– రాచరికం

విడుదల తేది– 31.01.2025
నటీనటులు– విజయ్‌ శంకర్, వరుణ్‌ సందేశ్, అప్సరా రాణి, ఈశ్వర్, హైపర్‌ ఆది, మహేశ్, శ్రీకాంత్‌ అయ్యంగార్, విజయ్‌ రామరాజు తదితరులు
ఎడిటర్‌– జెపి
సినిమాటోగ్రఫీ– ఆర్య సాయికృష్ణ
సంగీతం– వెంగీ
నిర్మాత– ఈశ్వర్‌
దర్శకత్వం– సురేశ్‌ లంకలపల్లి

కథ :

రాయలసీమలోని రాచకొండ ప్రాంతం.

ఆ ప్రాంతం నుండి సర్పంచ్‌ స్థాయినుండి రాజారెడ్డి (శ్రీకాంత్‌ అయ్యంగార్‌) అతి తక్కువకాలంలో యం.ఎల్‌.ఏగా, మంత్రిగా అవతారం ఎత్తుతాడు.

ఆ ప్రాంతంలో ఆయన ఇంటిముందుకు చెప్పులు వేసుకుని వెళ్లాలంటే కూడా ప్రజలు బిక్కుబిక్కుమంటూ వెళతారు.

సమానత్వం అంటే పొరపాటున కూడా ఒప్పుకోని మనిషి ఆయన.

రాచకొండను ఏక చత్రాధిపత్యంగా ఏలుతోన్న ఆయనకు పోటీగా వచ్చింది ఎవరు?

రాజకీయంగా సీయం అవ్వాలనుకున్న తన చిరకాల కోరికకు అడ్డొచ్చింది ఎవరనేది వెరీ ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌.

రాజరెడ్డి ఫైనల్‌గా సీయం అయ్యాడా? లేదా అనేది థియేటర్లోనే చూస్తే బావుంటుంది.

ఈ సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు ప్రేక్షకులకు ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తాయి.

ముఖ్యంగా 1980లు, 90ల్లో స్టూడెంట్స్‌ యూనియన్స్‌కి ఎందుకు అంత ప్రాముఖ్యతని సంతరించుకున్నవి చూడాలంటే

ఈ సినిమాలో ని తొలి భాగంలో ఎంతో కన్విన్సింగ్‌గా చెప్పారు దర్శకుడు సురేశ్‌ లంకలపల్లి.

సమానత్వం అనే నినాదం ఎక్కడ వినిపించినా కూడా ఆ పాయింట్‌లో చెప్పే బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఎంతో బావుంటుంది.

ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే పాయింట్‌తో దర్శకుడు చెప్పిన కాలేజ్‌ స్టోరీ ఎంతో హుందాగా అనిపించింది.

అక్కడవరకు బైరెడ్డి (విజయ రామరాజు) భార్యగా , కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపించిన అప్సరారాణి సెకండ్‌ హాఫ్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించింది.

ఆమెలో నటనను కాకుండా గ్లామర్‌ను మాత్రమే చూసిన కళ్లకు ‘రాచరికం’ సినిమాలో తన నటనతో మెప్పిస్తుంది.

ఈ సినిమా ఎండ్‌ పాయింట్‌ ఊహించని మలుపులతో ఎక్కడెక్కడో తిరిగి చివరకు రాజరెడ్డి పిల్లల దగ్గర వచ్చి ఆగుతుంది.

ఆడవాళ్లదేముంది? ఇంట్లో వండటానికి మగాడితో పండటానికే పనికోస్తుంది అనే ఆ ఏరియా వారికి సినిమాలో క్లైమాక్స్‌ ఓ గుణపాఠంలా అనిపిస్తుంది.

నటీనటుల పనితీరు :

అప్సరారాణిని సినిమాకి వెళ్లేముందు ఒకలా ఊహించుకుంటే థియేటర్‌నుండి బయటకు వచ్చేటప్పుడు మరోలా అనుకోవటమే ఆమె యాక్టింగ్‌ స్కిల్స్‌.

వరుణ్‌ సందేశ్‌ గతంలో నెగిటివ్‌ రోల్‌లో నటించినప్పటికి ఈ సినిమాలో నటన పరంగా మంచి మార్కులే దక్కించుకున్నారు.

కానీ, వరుణ్‌ ఆహార్యాన్ని మాత్రం ప్రేక్షకులు ఒప్పుకోరు.

ఆయన మేకప్‌లో ఒక్కోసారి ఒక్కోలా కనిపించి ఈ మీసంలో ఏదో తేడాగా ఉన్నాడే అనిపించేటట్లు ఉన్నారు.

బైరెడ్డి పాత్రలో నటించిన విజయరామరాజుకి చక్కని భవిష్యత్‌ ఉంటుంది.

అలాగే వీరూ పాత్రలో నటించిన విశ్వ కూడా చాలాకాలం తర్వాత మంచి పాత్రలో కనిపించారు.

హైపర్‌ ఆది పంచ్‌లు బాగానే పేలాయి. ‘రంగస్థలం’ మహేశ్‌ తన నటనతో మరోసారి మంచి మార్కులు వేయించుకున్నారు.

శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటన బావుంది. కాలేజ్‌ బ్యాక్‌గ్రాప్లో విజయ్‌శంకర్, ఈశ్వర్‌ల నటన ఎమోషనల్‌గా అనిపించింది.

ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా సినిమా చూసేవారికి ఈ సినిమా మంచి హై ఇస్తుంది.

టెక్నికల్‌ విభాగం :

రాచరికం సినిమా టెక్నికల్‌గా నెంబర్‌వన్‌గా నిలిచింది నిస్సందేహంగా సంగీత దర్శకుడు వెంగీ.

ఒక పెద్ద సినిమా రేంజ్‌లో ఎలివేషన్స్‌ ఇచ్చి సినిమాను హైప్‌ చేశారు.

చాలా చోట్ల తన బీజియంతో సినిమాకు ప్రాణం పోశాడు వెంగీ.

అలాగే కెమెరామెన్‌ సాయికృష్ణ విజువల్స్‌ కూడా బావున్నాయి.

ముఖ్యంగా దర్శకుడు విజన్‌కి తగినట్లుగా ఫైట్స్, డాన్స్‌ సీక్వెన్స్‌లు అందించిన ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు.

ప్లస్‌ పాయింట్స్‌ :

నటీనటుల పనితీరు
అప్సరారాణి, విజయ్‌ రామరాజు, హైపర్‌ ఆదిల నటన
సంగీతం
కెమెరా పనితనం
ఆడవారి గొప్పతనాన్ని చాటిచెప్పే డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

సెకండ్‌ హాఫ్‌లోని అర్ధంలేని రాజకీయం
లాజిక్‌లెస్‌ స్క్రీన్‌ప్లే
అతికించినట్లు ఉండే కొన్ని సీన్లు
కొన్ని అవసరం లేని బోల్డ్‌ డైలాగ్స్‌

ఫైనల్‌ వర్డిక్ట్‌ :

లాజిక్‌ మిస్సయినా మ్యాజిక్‌ మిస్సవదు..

రేటింగ్‌ : 2.5/5
శివమల్లాల

Also Read This : ఇమాన్వీ… ప్రభాస్ రాజు ఆతిధ్యం అంటే ఇది..!

Racharikam Review.
Racharikam Review.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *