నందమూరి తారక రామారావు అనగానే ప్రతి తెలుగువాని హృదయం పులకరించిపోతుంది.
అంతలా ఆయన ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉన్నాడు.
ఆయన మరణించి 29 ఏళ్లు పూర్తయినా కూడా ఇప్పటికి యన్టీఆర్ అనే టాపిక్ రాగానే ఆ టాపిక్ ఏమై ఉంటుంది అని ఎదురు చూస్తుంటారు.
అంతలా మనందరితో పెనవేసుకుపోయినా బంధం ఆయనది.
నందమూరి కళ్యాణ్‌రామ్‌గారికి తాతగారంటే ఎంతో ప్రేమతో కూడిన గౌరవం.
ఇప్పుడు ఎందుకు ఆయన టాపిక్ అంటే ఫోటోలో చూస్తున్న కారు యన్టీఆర్ గారు చివరిగా వాడిన కారు.
రామారావుగారు బ్రతికున్నంతవరకు ఆయన అంబాసిడర్ కారునే వాడేవారు. ఆ రోజుల్లో ఆ కారుకు చాలా క్రేజ్ ఉండేది.
యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే కారును వాడేవారట. ఆ విషయాన్ని కళ్యాణ్‌రామ్ గారే స్వయంగా తెలియపరచారు.
తాతగారికి గుర్తుగా ఆయన గవర్నమెంట్‌నుండి ఏబివై 9999 కారును కొనుక్కుని తాతగారిపై తన ప్రేమను చాటుకొన్నారు.
ఇప్పటికి ఆ కారు అలానే తన ఆఫీసులో ఉంచుకున్నారు కళ్యాణ్‌గారు.
ఇదిలా ఉంటే సీనియర్ యన్టీఆర్ గారి మరో మనవడు
తన పేరుతో పాటు నటనా లక్షణాలను కూడ పుణికి పుచ్చుకున్న నటవారసుడు
జూనియర్ యన్టీఆర్ తాను వాడే కార్లన్నంటికి ఆల్‌నైన్స్ (9999) నంబర్ ఉండే విధంగా చూసుకుంటారు.
ఆ నంబర్ కోసం ఎంత డబ్బులైనా వెచ్చించి నంబర్‌ను రిజిస్టర్ చేయించుకుంటారాయన.
అలాగే యన్టీఆర్ కుటుంబంలోని అనేకమంది వారసులు అలాంటి కారు నంబర్లనే వాడతారు.
అందుకే ఆల్ నైన్స్ నంబర్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.
ఆ నంబర్‌కు ఇప్పటికి లక్షల్లోధర పలుకుతుందంటే
అది తొమ్మిదికి ఉన్న పవర్‌తో పాటు యన్టీఆర్ గారు వాడిన నంబర్ అవ్వటంకూడా ఒక డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఇది యన్టీఆర్ కార్ ఫోటో స్టోరీ.
శివమల్లాల
Also Read This : యన్టీఆర్, మహేశ్‌బాబు రవివర్మను ఎందుకు ఆట పట్టించారు?
