సమంత అనగానే అందం, అభినయం కలగలిసిన టాలెంటెడ్ హీరోయిన్ మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.
ఈ మధ్య సడెన్‌గా సమంత మిస్సయిన ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఎక్కడికి వెళ్లింది సమంత ? ఇప్పుడు ఆమె నటించటం లేదా? అనుకుంటున్నారంతా.
ప్రస్తుతం వరల్డ్ పికిల్ బాల్ లీగ్ టోర్నమెంట్ భారతదేశంలో జరుగుతుంది.
ఈ సందర్భంగా చెన్నై సూపర్ ఛామ్స్ పికిల్ బాల్ టీమ్ ఓనరైన సమంత ఆ టోర్నమెంట్‌లో కనిపించి సందడి చేసింది.
అలాగే సమంత త్రలాలా మూవీంగ్ పిక్చర్స్ పతాకంపై ఓ సినిమాను తన స్నేహితులతో కలిసి నిర్మిస్తున్నారు.
నటిగా నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్‌సిరీస్లో నటిస్తున్నారు.
ఇలా నటిగా, నిర్మాతగా, చెన్నై టీమ్‌కి ఓనర్‌గా పలు బాధ్యతలను పోషిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారామె.
ఆ టోర్నమెంట్‌లో కలిసిన కొందరు మీడియా మిత్రులతో ఆమె మాట్లాడుతూ ‘ ఫుల్ బిజీగా ఉన్నాను.
ఎంతో ఆనందంగా ఉన్నాను అంటూ తన ఫ్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడారామె.
అక్కడే ఫ్యామిలీమ్యాన్ అనే టాపిక్ రాగానే ‘ఫ్యామిలీమ్యాన్–3’లో నేను లేను’ అని అంటూనే నవ్వుతూ అక్కడినుండి వెళ్లిపోయారామె.
శివమల్లాల
Also Read This : మహేశ్‌కైనా,ప్రియాంకకైనా రూల్ రూలే అంటున్న జక్కన్న….
