రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. RRR తరువాత గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత చేసిన ఆచార్య సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది.
దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి విడుదలై ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
ఇది ఇలాఉంటే రామ్ చరణ్ చేయబోతున్న సినిమాల విషయంలో చాలావరకు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.
గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తే తప్ప గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కి అర్థం అయితే ఉండదు.
కాబట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
అందువల్లే చిరంజీవి సైతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన మార్పులు చేర్పులు చేయమని చిరంజీవి చెప్పారట.
మరి దానికి తగ్గట్టుగానే బుచ్చిబాబు వాటిని అంగీకరించి ఆ మార్పులను చేసినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు సుకుమార్ ఇద్దరితో చేస్తున్న సినిమాలతో రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి.
లేకపోతే మాత్రం మిగతా హీరోల కంటే కూడా చాలా వరకు వెనుకబడిపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయ్.
ఇక శంకర్ పూర్తిగా తన ఫామ్ ను కోల్పోవడంతో గేమ్ చేంజర్ సినిమాని సక్సెస్ గా నిలుపలేకపోయాడనేది వాస్తవం.
కాబట్టి శంకర్ తో సినిమాలు చేయడానికి ఏ తెలుగు హీరో కూడా సాహసం చేసే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ ఆయన తన తదుపరి సినిమాలను తమిళ్ హీరోలతో చేస్తే తప్ప అతనికి ఛాన్సులు ఇచ్చే అవకాశాలైతే లేవు.
ఇక గేమ్ చేంజర్ కోసం విపరీతంగా బడ్జెట్ ను ఖర్చు పెట్టించిన ఆయన ఆ సినిమా అవుట్ పుట్ మీద తనకు సంతృప్తిగా లేదని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం.
ఇక ఐదు గంటల సినిమా అవుట్ పుట్ ను తీసిన అందులో నుంచి చాలా సీన్లను కట్ చేయడం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో రాలేదు అంటూ కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేశాడు.
సంజు పిల్లలమర్రి
Also Read This : శ్రీకాకుళం ప్రజల కోసం చేపల పులుసు వండిన నాగ చైతన్య