స్టార్ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత సినిమా వాళ్లకు రేవంత్ రెడ్డి పవర్ ఏంటో క్లారిటీ వచ్చింది.
గతంలో ఉన్న ముఖ్యమంత్రులు వేరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వేరు అనే క్లారిటీ ప్రతి ఒక్కరికి స్క్రీన్ పై బొమ్మ కనబడింది.
ఎందరో ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న సినిమా వాళ్లకు రేవంత్ రెడ్డి మాత్రం తలవంచే ప్రసక్తే లేదంటూ తొడకొట్టి మరీ చెబుతున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ బ్రతకాలంటే బెనిఫిట్ షోలు ఉండాలి..
టికెట్ ధరల పెంచాలి అన్నట్లుగానే బిహేవ్ చేస్తున్న సినిమా పరిశ్రమకు శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ తో మైండ్ బ్లాక్ అయింది.
భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయితే కచ్చితంగా ఈ రెండు కావాల్సిందే.
ఈ రెండు ఎలిమెంట్స్ లేకపోతే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాత ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం చాలా సమస్యలే ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడానికి ససేమీరా అనడంతో నిర్మాత దిల్ రాజు తన సినిమా గేమ్ చేంజర్ కోసం ఎలా రేవంత్ రెడ్డిని ఒప్పించాలి అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
కానీ ఒక నిర్మాత మాత్రం రేవంత్ రెడ్డితో మాకు అసలు అవసరం లేదు… టికెట్ ధరలు పెంచకపోయిన పర్వాలేదంటూ తొడ కొట్టి చెప్పడంతో సినిమా వాళ్ళు షాక్ అయ్యారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న డాకు మహారాజ్ సినిమా నిర్మాత సూర్యదేవరనాగ వంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హిట్ పెంచుతున్నాయి.
బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా కు టికెట్ ధరలు పెంచడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు.
టికెట్ ధరల పెంపుకోసమే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదని ఆయన స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే తెలంగాణలో డాకు మహారాజ్ ఆడుతుందని క్లారిటీ ఇచ్చేసారు.
డాకూ మహారాజ్ కు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిందని.
తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేకపోతే మాకు ఏం నష్టం లేదంటూ ఆయన క్లియర్ కట్ గా చెప్పేశారు. దీనితో సినిమా వాళ్లు కంగుతున్నారు.
ఒకవైపు రేవంత్ రెడ్డిని దారిలోకి తెచ్చుకోవడానికి మేము నానా కష్టాలు పడుతుంటే అనవసరంగా ఇప్పుడు సూర్యదేవర నాగవంశీ మళ్లీ రేవంత్ రెడ్డిని గెలికాడని వర్రీ అయిపోతున్నారు.
నాగవంశీ ఇచ్చిన షాక్ తో దిల్ రాజు ఏ మొఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి తమ సినిమాకు టికెట్ ధరలు పెంచాలని అడుగుతారు అంటూ పెద్ద రచ్చే జరుగుతుంది.
సంజు పిల్లలమర్రి
Also read this : కోట్ల బిజినెస్ నుండి సినిమాల్లోకి..