మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఇది చాలా దురదృష్టకరమైన యాక్సిడెంట్.
నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవరు తప్పులేదు.
ఇక్కడున్న వాళ్ళందరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి సెక్షన్ నుంచి ఉన్న అందరూ ఇక్కడికి వచ్చింది ఒక మంచి ఆలోచనతోనే.
సినిమా అందరం కలిసి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో చేసినా సరే ఇది యాక్సిడెంట్. ఇది పూర్తిగా యాక్సిడెంట్ అని నేను మరోసారి చెప్పాలనుకుంటున్నాను.
యాక్సిడెంట్ జరిగినందుకు నేను ఆ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.
ఎందుకంటే నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయం జరిగినందుకు. ఒక సినిమా వ్యక్తిగా నా జీవిత ఆశయమే థియేటర్ కు వచ్చిన వ్యక్తులను ఎంటర్టైన్ చేయాలి అని.
థియేటర్ కి వచ్చిన మీ అందరిని నవ్వుతూ పంపించాలి అనేది నా కోరిక. మీ మనసులను గెలిచి పంపించాలి అనుకునే మనిషిని నేను.
నాకు థియేటర్ ఏ దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలో ఒక యాక్సిడెంట్ జరిగిందంటే నాకంటే బాధపడేవాడు ఎవరైనా ఉంటారా? నాకు నిజంగా బాధగా ఉంది.
ఆ కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను.. బాబు ఆరోగ్య పరిస్థితి గురించి నేను గంట గంటకు వివరాలు తెలుసుకుంటున్నాను.
మంచి విషయం ఏమిటంటే ఇప్పుడు కొంత మెరుగవుతుంది. బాలుడు కదులుతున్నాడు అని చెప్పుకొచ్చారు.
ఇన్ని దారుణమైన విషయాల్లో అది కాస్త ఆనందం కలిగించే విషయం అని అన్నారు.
నేను ఎందుకు స్పందించకుండా ఉంటాను నాకు ఒక బాబు ఉన్నాడు నేను తండ్రిని నా కొడుకుకి అలా జరిగితే చూస్తూ ఉంటానా నాకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అందుకే ఆగిపోయ.
నేను నా తండ్రిని స్పెషల్ పర్మిషన్ తో వెళ్లి చూసి రామన్ని చెప్పాను అలాగే కుదిరితే సుకుమార్ మరియు బన్నీ వాసుని వెళ్ళమని చెప్పాను.
చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయ్ సినిమా సక్సెస్ అయ్యాక కానీ అవి అన్నీ ఆపేసాము కేవలం ఆ కుటుంబ పరిస్థితి బాలేదు అన్నప్పుడు నేను ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంట అని అన్నారు.
సంజు పిల్లలమర్రి