...

బచ్చలమల్లి రివ్యూ

ఒకప్పుడు కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్.. కొన్నేళ్ల నుంచి ఎక్కువగా సీరియస్ పాత్రలే చేస్తున్నాడు.

‘నాంది’లో ఇంటెన్స్ పాత్రతో ఆకట్టుకున్న నరేష్. ఇప్పుడు ‘బచ్చల మల్లి’ అనే మరో సీరియస్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని రూపొందించాడు.

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గోదావరి ప్రాంతంలోని తుని మండలంలో సురవరం అనే ఊరిలో బచ్చలమల్లి (అల్లరి నరేష్) అనే కుర్రాడుంటాడు.

అతను చిన్నప్పుడు తెలివైన విద్యార్థి. పదో తరగతిలో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుస్తాడు. అతడికి తండ్రంటే చాలా ఇష్టం. తండ్రికీ అతనంటే ప్రాణం.

ఐతే తనెంతో ప్రేమించే తండ్రి చేసిన ఒక తప్పుతో అతణ్ని అసహ్యించుకుంటాడు. తండ్రి మీద ద్వేషం పెంచుకుని.. చదువు మీద ధ్యాస తగ్గిస్తాడు మల్లి.

ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు కూడా బానిస అయిపోతాడు. తండ్రి ఎంత సర్దిచెప్పాలని చూసినా అతడిలో మార్పు రాదు.

రోజు రోజుకూ మూర్ఖంగా తయారవుతున్న మల్లిలో కావేరి పరిచయంతో మార్పు వస్తుంది. అతను వ్యసనాలు వదిలేసి ప్రయోజకుడయ్యే ప్రయత్నం చేస్తాడు.

కానీ కావేరితో పెళ్లి దగ్గర సమస్య తలెత్తి మళ్లీ మల్లిలోని మూర్ఖుడు బయటికి వస్తాడు. ఈ క్రమంలో తన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది..

ఇంతకీ కావేరిని అతను పెళ్లి చేసుకున్నాడా లేదా.. తండ్రితో అతడి గొడవ ఎక్కడిదాకా వెళ్లింది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెర మీదే చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:

కామెడీ పాత్రలు చేస్తున్నపుడు తెలియలేదు కానీ.. అల్లరి నరేష్ ఎంత మంచి నటుడో అతను సీరియస్ పాత్రలు చేస్తున్నపుడే బాగా తెలుస్తోంది.

బచ్చల మల్లి పాత్రలో అతను జీవించేశాడు. ఒక దశ దాటాక నరేష్ కాకుండా చూసేవాళ్లకు మల్లినే కనిపిస్తాడు.

తనను పట్టుకుని కొట్టాలనిపించే ఫీలింగ్ తీసుకువస్తాడంటే అతను ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు.

పతాక సన్నివేశాల్లో తన నటన మరింత బాగుంది. నరేష్ తర్వాత ఎక్కువ మెప్పించేది రావు రమేష్.

చాలా తక్కువ సన్నివేశాల్లోనే ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరో హీరోయిన్ని అడగడానికి తన ఇంటికి వచ్చిన సీన్లో..

అలాగే క్లైమాక్సులో రావు రమేష్ భలేగా చేశాడు. హీరోయిన్ అమృత అయ్యర్ ఓకే. ఆమె పాత్రకు తగ్గట్లుగా నటించి మెప్పించింది.

రోహిణి తల్లి పాత్రలో మరోసారి అద్భుతంగా నటించింది. తల్లి పాత్రల్లో ఇంత సహజంగా ఒదిగిపోయే నటి ఈ రోజుల్లో ఇంకొకరు కనిపించరు.

తండ్రి పాత్రలో బలగం నటుడు జయరాం కూడా బాగా చేశాడు. హరిప్రియ.. ప్రవీణ్.. హర్ష చెముడు.. వీళ్లంతా సహాయ పాత్రల్లో చక్కగా నటించారు.

విలన్ పాత్రలో కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ఓకే.

సాంకేతిక వర్గం:

విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఓకే. పాటల్లో చార్ట్ బస్టర్ అనిపించే సాంగ్ ఏదీ లేకపోవడం మైనస్సే కానీ.. తీసిపడేసేలా మాత్రం లేవు.

తెర మీద అలా అలా సాగిపోతాయి. నేపథ్య సంగీతం బాగుంది.నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగానే కుదిరాయి.

దర్శకుడు సుబ్బు మంగాదేవి ‘బచ్చలమల్లి’ కథను సిన్సియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు.

ఐతే అతను కొన్ని ఎపిసోడ్లను నమ్ముకుని సినిమాను నడిపించేశాడు కానీ.. వాటిని మినహాయిస్తే చాలా వరకు కథ ఫ్లాట్ గా సాగిపోయింది.

ఆరంభ.. చివరి ఎపిసోడ్ల మధ్య కథనం ఇంకా ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవాల్సింది.

స్క్రీన్ ప్లే ఎగుడుదిగుడుగా సాగి ఇబ్బంది పెట్టింది. ఎమోషనల్ సీన్లను మాత్రం సుబ్బు బాగా డీల్ చేశాడు. డైలాగులు కూడా బాగున్నాయి.

చివరగా : బచ్చల మల్లి…. ఒకే ఒకే అనిపించింది….

రేటింగ్- 2/5

Also Read this : 1500 కోట్లు అయినా ఎందుకు ఈ మౌనం?

Surya Teja Exclusive Interview
Surya Teja Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.