విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అటు ఓటీటీ డీల్ కానీ ఇటు శాటిలైట్ హక్కులను కానీ కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. మరొక హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది.
తాజాగా ఐశ్వర్య, వెంకటేష్ పై చిత్రీకరించిన “గోదారి గట్టు” పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాట విపరీతమైన క్రేజ్ ను కూడా అందుకుంది.
ముఖ్యంగా ప్రముఖ సింగర్ రమణ గోగుల ఈ పాటను ఆలపించారు.
ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ లో ఈ పాట బాగా ట్రెండ్ అవుతుండగా.. ముఖ్యంగా రీల్స్ చేస్తూ అటు సెలబ్రిటీలు కూడా పాటను మరింత పాపులర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ పాట పాడడం కోసం ప్రముఖ సింగర్ రమణ గోగుల ఎంత పారితోషకం తీసుకున్నారు అనే విషయం వైరల్ గా మారుతోంది.
రమణ గోగుల చిన్నతనంలోనే తన అద్భుతమైన గాత్రంతో అశేష ప్రేక్షభిమానం పొందారు.ఈయన అప్పట్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలకు పాటలు పాడేవారు.
అటు ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ తన పాటలను తానే పాడుకునేవాడు అని అనుకునేవారు. ఆ రేంజ్ లో ఆయన పాటలు పాడేవారు.
కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు ప్రభాస్, వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా పాటలు కూడా పాడారు. ఇక అప్పట్లో ఆయన పాడిన అన్ని పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి.
గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే ఈయన గొంతును మళ్లీ ఆడియన్స్ కి వినిపించాలనుకున్న అనిల్, వెంకటేష్ ఈయనను పట్టుబట్టి మరీ “గోదారి గట్టుమీద” అనే పాటను పాడించారట.
రెండు వారాల క్రితం విడుదలైన ఈ పాటకి యూట్యూబ్లో 28 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
రమణ గోగుల వెంకటేష్ మీద ఉన్న అభిమానంతోనే రెమ్యునరేషన్ తీసుకోలేదట.
ఇక నిర్మాత దిల్ రాజ్ కి కేవలం ఆయనను అమెరికా నుండి రప్పించడానికి టికెట్ ఖర్చులు, హోటల్లో ఉండడానికి అయ్యే ఖర్చులు తప్ప రమణ గోగుల ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం.
ఇకపోతే ఈ పాటతో రమణ గోగుల రీయంట్రీ ఇచ్చారని , పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా కోసం కూడా పాట పాడాలని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు.
పవన్ అభిమానుల రిక్వెస్ట్ మేరకు పాట పాడుతారేమో చూడాలి.
సంజు పిల్లలమర్రి
Also Read This : బచ్చలమల్లిలో నా క్యారెక్టర్ గుర్తుండిపోద్ది