YS Sharmila :
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. భద్రకాళి అవతారమెత్తారు.
తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, సాక్షి మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కడప జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షర్మిల.. తనపై వైసీపీ నేతలు మీడియాలో, సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకత్వం రోజుకో జోకర్ ను తెస్తూ తనపై నిందలు వేయిస్తోందని మండిపడ్డారు.
ఎన్ని నిందలు వేసినా తాను భయపడబోనని, తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని, పులి కడుపులో పులే పుడుతుందని ప్రకటించారు.
తాను వైఎస్ షర్మిలా రెడ్డి నేనని స్పష్టం చేశారు. జగన్ అన్న అప్పటి మనిషి కాదని.. ఇప్పటి జగన్ అన్న ను ఇంతకుముందెపుపడూ చూడలేదని అన్నారు.
’నా మీద స్టోరీలు అల్లుతున్నారు… రోజుకో జోకర్ ను తెస్తున్నారు . నాపై బురద చల్లుతున్నారు. నిన్న ఒక జోకర్ తో ప్రణబ్ ముఖర్జీ చెప్పాడట!
జగన్ జైల్లో ఉన్నప్పుడు నా భర్త అనిల్ .. సోనియాగాంధీని కలిశారట! జగన్ ను బయటకు రానివ్వద్దని లాబీయింగ్ చేశామట! ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ లేరు.
ఒక పెద్ద మనిషి పేరును కూడా మీరు వదలడం లేదు. మీ కుట్రలకు అంతే లేకుండా పోయింది’’ అని షర్మిలా ఫైర్ అయ్యారు.
తనకు పదవీకాంక్ష ఉంటే…నాన్నను అడిగి తీసుకోనా? వైసీపీ లోనైనా పదవి తీసుకోనా? అని ప్రశ్నించారు. అనిల్.. భారతిరెడ్డి తో కలిసి సోనియా వద్దకు వెళ్ళారని గుర్తు చేశారు.
భారతికి తెలియకుండా సోనియాను అడిగారా ? భారతి రెడ్డి లేనప్పుడు అడిగారా? అని ప్రశ్నించారు. కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడా చెప్పినట్లు రికార్డ్ కూడా లేదని అన్నారు.
ఏం పీక్కుంటారో పీక్కోండి
తెలంగాణలో తనతో కలిసి పనిచేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తోందని, తన పై వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుతోందని షర్మిల మండిపడ్డారు. ఇదే సాక్షి సంస్థలో తనకు కూడా భాగం ఉందని చెప్పారు.
’’ మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. సాక్షిలో నాకు సగం భాగం ఇచ్చారు. సగం భాగం ఉన్న నాపై.. నా సంస్థే బురద చల్లుతోంది. విలువలు ,విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చాను. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలను. పోలవరం వచ్చేవరకు విశ్రమించను.
ఏం పీక్కుంటారో పీక్కోండి’’ అంటూ షర్మిల ఆగ్రహోదగ్రురాలయ్యారు. వాస్తవానికి సాక్షిలో గతంలో ప్రతిపక్ష నేతలపై ఇటువంటి కథనాలు వచ్చేవి.
తమపై సాక్షి చల్లిన బురదను వారంతా ఇతర మీడియా సంస్థల ద్వారా కడుక్కునేవారు. కానీ, ఇప్పుడు జగన్ రెడ్డి సొంత చెల్లిని టార్గెట్ చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
మొరుసుపల్లి షర్మిలా శాస్త్రి అంటూ ఆమె భర్త ఇంటిపేరును, కులాన్ని ఆమెకు జత చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
దీంతో బహిరంగ వేదికల మీద షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. తన సొంత మనుషుల వద్ద మాత్రం కన్నీరు పెట్టుకుంటున్నారట.
సొంత చెల్లి అని కూడా చూడకుండా ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
Also Read : ఆ భూముల్లో నిర్మాణాలు, అనుమతుల నిలిపివేత!