విడుదల తేది : 04–06–2024
మూవీ రన్‌టైమ్ : 3 గంటల 20 నిమిషాలు
నటీనటులు : అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్, రష్మికా మండన్న, జగపతిబాబు, రావురమేశ్, సునీల్, అనసూయ,
బ్రహ్మాజీ, దివి వైద్య, ధనంజయ్,తారక్ పొన్నప్ప, శ్రీలీల, జగధీష్, కల్పలత, శ్రీతేజ్, అజయ్‌ఘోష్, కిల్లి క్రాంతి తదితరులు
ఎడిటర్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : మిరస్లో కూబా
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత : వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని
కథ, దర్శకత్వం : సుకుమార్ బి
కథ :
పుష్ప కథ అందరికి తెలిసిందే. చిన్న కూలి పని చేసుకునే పుష్ప పెద్ద ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎలా మారారు అనే కథను మనం ‘పుష్ప–ది రైజ్’లో చూశాం.
ఆ కథలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అంతా అల్లు అర్జునే. మిగతా వారంతా కథకి, అర్జున్‌కి సపోర్టు చేసినట్లుంటారు.
కానీ ‘పుష్ప– ది రూల్’ సినిమాలో కథంతా వేరేలెవెల్‌లో ఉంది. కథలోకి వెళ్తే పుష్ప ఓపెనింగ్ షాట్ లోనే జపాన్ లో తేల్తాడు .
పుష్ప జపాన్ ఎలా వెళ్ళాడు ? అక్కడ ఏమైంది ? అక్కడి నుండి కథ ఎలా మలుపులు తిరిగింది?
కథ వరకు చెప్తే ఇంతే ఇంతకుమించి చెప్తే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఈ కథను ఇంతకంటే చెప్పకూడదు .
ఒక మనిషికి ఇగో వస్తే, ఇగోతో పోరాటం సాగిస్తే ఎంత దూరమైనా వెళతాడు అని చెప్పటానికి దీనికి మించి పరాకాష్ట ఉండదు.
ఇగో వచ్చినప్పుడు ఒక మనిషి ఆత్మభిమానానికి మించింది ఎంలేదు అనుకున్నప్పుడు ఎలా ఫైట్ చేసాడు అదే పుష్ప-2 .
పుష్ప-2 ది రూల్ అంటూనే ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకున్నాడు.
ఎర్రచందనం స్మగ్గ్లింగ్ గురించి మొత్తం ఓనర్ షిప్ అందరి దగ్గరినుండి ఎలా గుంజెసాడు.
కూలిగా స్టార్ట్ అయినా పుష్ప జీవితం వేలకోట్ల రూపాయలకి ఎగబాకిన వైనం ఇవన్నీ థియేటర్లోనే చూడాలి.
నటీనటుల పనితీరు : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూడు గంటల 20 నిమిషాల సినిమాలో ప్రేక్షకునికి ఎక్కడ బోర్ కొట్టించకుండా
సినిమా థియేటర్‌లో అటు ఇటు కదలకుండా ఫోన్ చూసుకోకుండా ప్రతి ఒక్క మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తే చాలు. అంతకంటే పెద్ద విజయం ఏ సినిమాకి అవసరం లేదు.
అలాంటి పెద్ద విజయాలను బన్నీ –సుకుమార్‌లు గతంలో చాలా సార్లు అందుకున్నారు.
కానీ ‘పుష్ప–2’ విషయానికొస్తే ప్రపంచంలోని తెలుగువారందరూ పూనకం వచ్చినవారులా సినిమా కోసం ఎదురు చూశారు.
దానికి కారణం ఉంది. ‘పుష్ప’ సాధించిన మాస్ విజయంతో ఈ సినిమా కథ పూర్తిగా మారింది. పుష్పకి ముందు బన్నీ వేరు ఈ రోజున మార్కెట్‌లో ఉన్న బన్నీ వేరు.
ఆ లెక్కని ఎక్కడా తప్పకుండా కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ తనూ లెక్కతప్పకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో సినిమాని తెరకెక్కించారు తెలుగు సినిమా టాప్ డైరెక్టర్ సుకుమార్.
ఈ సినిమాకి నటీనటులు ప్రాణం పెట్టి పనిచేశారు అంటే దానికి నూటికి నూరుపాళ్లు కారణం దర్శకుడు సుకుమార్ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో అంతర్మధనం ఉంటూనే ప్రతి ఒక్క పాత్ర ఇంపార్టెన్స్‌ను చూయించారు దర్శకుడు.
టెక్నికల్ విభాగం :
ఒక్కో ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా పూర్తిగా తన లైటింగ్‌తో మంత్రముగ్ధుల్ని చేశారు కెమెరామెన్ క్యూబా. దేవీశ్రీ ప్రసాద్ మరోసారి తన బాణీలతో దుమ్మురేపారు.
కొన్ని చోట్ల ఊహించని ఎలివేషన్స్ వచ్చినప్పుడు ఆ సౌండ్‌కి ఫిధా అవ్వాల్సిందే.
అవుట్‌పుట్ మూడుగంటల 20 నిమిషాలు వచ్చిందంటే టోటల్ అవుట్‌పుట్ ఎంత వచ్చి ఉండవచ్చు.
దానిని స్క్రీన్‌మీదకి అందంగా తీసుకువచ్చే వరకు ఎడిటర్ నవీన్‌నూలి కష్టం ఏ రేంజ్‌లో ఉందో సినిమా చూస్తే తెలుస్తుంది.
వీఎఫ్‌ఎక్స్ రూపంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా నిర్మాతల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.
ఒక ప్రాంతీయభాషా చిత్రాన్ని అంతర్జాతీయ సినిమాగా రూపుదిద్దుకోవాలంటే ఆ సినిమాకి ఏమేం కావాలో అవన్నీ దర్శకునితో పాటు
యూనిట్ మొత్తానికి ఎంతో గొప్పగా అందించిన నిర్మాతల టీమ్‌గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి నిర్మాణ విలువలు ‘పుష్ప–2’ సినిమాకి అధనపు ఆకర్షణ.
ప్లస్ పాయింట్స్ : అల్లు అర్జున్ నట విశ్వరూపం,దేవి శ్రీ ప్రసాద్ సంగీతం,ఫైట్స్ జాతర సీన్.
ఫైనల్ వర్డిక్ట్ : పుష్ప సినిమా చూడాల్సిందే అని రూల్ చేసారు
రేటింగ్ : 5/5
శివమల్లాల