religion most dangerous:
అమెరికాలో ప్రతీ ముగ్గురిలో ఒక్కరు తాము ఏ మతానికి చెందినవారం కాదని చెప్పుకుంటున్నారు. ప్రఖ్యాత ఫ్యూ రిసెర్చ్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రజల్లో మారుతున్న ఆలోచనలను ఈ సర్వే ప్రతిబింబిస్తోంది. అచ్చం ఇలాంటి సర్వేనే 1990లో నిర్వహిస్తే 90శాతం మంది అమెరికన్లు తాము క్రిస్టియన్లం అని చెప్పుకున్నారు.
అది ఇప్పుడు 30శాతానికి పడిపోయింది. అంటే 30 ఏళ్లలోనే ప్రజల విశ్వాసాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దీనిపై మానసిక శాస్త్రవేత్తలు ప్రధానంగా ద్రుష్టి పెట్టారు.
ఇంత వేగంగా ప్రజల విశ్వాసాల్లో మార్పునకు గల కారణం ఏంటనేదానిపై విశ్లేషణ ప్రారంభించారు.
ఏ మతానికి చెందినవారం కాదని చెప్పుకొన్నవారిలోనూ వేర్వేరు తరహా వ్యక్తులు ఉన్నారు. కొందరు దేవుడిని మొత్తానికే నమ్మని నాస్తికులైతే, మరి కొందరు ఏదో శక్తి తమను నడిపిస్తుందని నమ్మేవారు ఉన్నారు.
ఈ రెండు రకాలతో పాటు దేవుడు, అద్రుశ్య శక్తితో మాకేం సంబంధం లేదు మా లైఫ్ మేం జీవిస్తున్నాం అనే వర్గం కూడా పెరుగుతోంది.
ఫ్యూ రిసెర్చ్ సర్వేల మాకు మతం లేదన్న వారిలో 17శాతం మంది నాస్తికులు. 20శాతం మంది ఏదో ఒక శక్తి తమను నడిపిస్తుందని నమ్మేవారు.
మిగతా 63శాతం మంది తమకు దేనిపైనా విశ్వాసం లేదని, దేవుడు, అద్రుశ్య శక్తితో తమకు సంబంధం లేదని చెప్పారు. వీరు స్వర్గం, నరకాలు, ఆత్మలు ఇవేవీ నమ్మబోమని చెప్పారు.
ఎందుకు మతాన్ని వదిలేస్తున్నారు?
మానవ సమాజానికి మతం అత్యంత ప్రమాదరకమైందని వీరు చెప్తున్నారు. మత సంస్థల మోసాలను, మత బోధనల్లోని లోపాలను వీరు ప్రశ్నిస్తున్నారు. ఆశ్చర్యకరంగా వీరిలో కొంత మంది సైన్స్ ను కూడా వ్యతిరేకించారు. సైన్స్ వల్ల కూడా మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు.