అల్లుఅర్జున్ మాస్ మానియా కంటిన్యూగా కొనసాగుతుంది. ఓ పక్క టిక్కెట్ రేట్లు అనూహ్యంగా పెంచినా సరే పర్వాలేదు అన్నట్లు ప్రేక్షకులు ‘పుష్ప–2’ సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తూ అడ్వాన్స్ బుకింగ్‌లకోసం ఎగబడుతున్నారు. దాదాపు అరవై శాతం కంటే ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతుంది. అయినాసరే టిక్కెట్లు దొరక్క బ్లాక్‌లో టిక్కెట్లు కొనుకోవటానికి సిద్ధపడుతున్నారు ఆడియన్స్. ప్రీమియర్‌షోల విషయానికొస్తే బుధవారం రాత్రి 9గంటల30 నిమిషాల షోకి తెలంగాణా గవర్నమెంట్ అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్‌కి ఒక్కో టికెట్ ధర 1121 కాగా మల్టీప్లెక్స్ టికెట్ ధర 1239గా నిర్ణయించారు. తర్వాత నాలుగు రోజులు అంటే గురు, శుక్ర, శని, ఆదివారాల ధరలు సింగిల్ స్క్రీన్ 354రూ, మల్టీప్లెక్స్ ధరలు 531 రూపాయలు.. ఇలాంటి రేట్ కార్డ్ పెట్టి సినిమా రిలీజ్ చేయటానికి హీరోకి, దర్శకునికి, నిర్మాణసంస్థకి దమ్ము కావాలి. ఆ దమ్ము వాళ్లందరికి ఉందని టికెట్ రేట్ చూస్తే తెలుస్తుంది.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా….
శివమల్లాల