తమిళ స్టార్ దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో ఉంటూనే.. తన చివరి చిత్రం ‘విజయ్ 69’ తో బిజీగా ఉన్నాడు.
ఇక ఈ సినిమా అనంతరం సినిమాలకు దూరం అవుతాడని తెలియడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే విజయ్ వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో చక్కర్లుకొట్టింది .
విజయ్ కొడుకు జాన్సన్ సంజయ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేది హీరోగా కాదు డైరెక్టర్ గా…
అవును మీరు విన్నది నిజమే.. జాన్సన్ దర్శకునిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.
తన మొదటి సినిమా హీరో సందీప్ కిషన్ తో చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు.
తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా కి లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్ ప్రజెంట్ చేయగా. తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.
ప్రజెంట్ ఈ మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.
సంజు పిల్లలమర్రి
Also Read This : శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్...