Bachhala Malli :
అల్లరి నరేశ్ మాస్ పాత్రలో కనిపిస్తే ఉండే కిక్కే వేరు. ప్రస్తుతం అలాంటి కిక్కుని తన ఫ్యాన్స్‌కి ఇచ్చే ప్రయత్నంలో నరేశ్ ఉన్నారు.
కారణం ఏంటంటే తన ఒరిజినల్ జానర్ కామెడినుండి కొంచెం బయటకు వస్తే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది.
ఉదాహరణకు ‘నాంది’ సినిమా. రియలస్టిక్ ఇన్సిడెంట్‌తో 1990ల నాటి కథతో ప్రేక్షకులముందుకు ‘బచ్చలమల్లి’ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నరేశ్.
సాయిధుర్గా తేజ్ హీరోగా ‘సోలో బతుకు సో బెటర్’ అనే సినిమాతో దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణనంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 20వ తేదిన విడుదలవ్వనుంది.
హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలను అందిస్తున్నారు.
Also read this : రాకేశ్‌ను ముప్పతిప్పలు పెట్టిన చలాకి చంటి…
