...

నాకు ఆ పాత్ర నచ్చలేదు : శ్రద్ధ శ్రీనాథ్

Mechanic Rocky :

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు.

దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి బ్యానర్ ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను నిర్మించారు.

విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. కాగా ఈ సినిమాకి సంబంధించి మెకానిక్ రాకి 2.0 ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.

ని 2:23 సెకండ్స్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మెకానిక్ రాకీ ప్రమోషన్స్ లో  భాగంగా శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ : మెకానిక్ రాకీ సినిమాలో నా పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుంది.

విశ్వక్ సేన్ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం సెట్స్ లో చాలా ఆక్టివ్ గా ఉంటారు. ఈ సినిమా తో అయినా నాకు మంచి క్యరెక్టర్స్ వస్తాయ్ అనుకుంటున్నా.

విశ్వక్సెన్ తో నటించే అవకాశం నాకు ఫలక్‌నుమా దాస్‌ సినిమా అప్పుడే వచ్చింది కానీ నాకు ఆ పాత్ర నచ్చలేదు అందుకే రిజెక్ట్ చేశాను.

ఆ తరువాత కూడా 2,3 సినిమాలో నటించే అవకాశం కోల్పోయినట్టు తెలిపారు. ఈ సినిమాతో నాకు మళ్ళీ మంచి పాత్రలు వస్తాయ్ అని అనుకుంటున్నా.

ఈ సినిమా నవంబరు 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంజు పిల్లలమర్రి

Also read this : ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని సినిమా తీసాం: విశ్వక్

ROCKING Rakesh Exclusive Interview
ROCKING Rakesh Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.