యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం జోరు మీద ఉన్నారు. ఇప్పటికే ఈ ఏడాది విశ్వక్ నటించిన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు
రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయం సాధించలేకపోయాయి.
ఇక విశ్వక్ నుంచి మరో సినిమా ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ మరియు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆదరగోడుతున్న
అందాల భామ మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకి రవి తేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించారు.
ఈ సంధర్బంగా విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడుతూ : “ఈ సినిమా లో ఒక కీ పాయింట్ ఉంటుంది. అది ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని లైన్ ని ఈ సినిమా లో మేము టచ్ చేసాం.
ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని సినిమా తీసాం. గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఈ సినిమా ఒకే టైంలో చేశాను.
సినిమా చేస్తున్నప్పుడు చిన్న భయం ఉండేది రిలీజ్ అయ్యే లోపు సినిమా ఎవరైనా చేస్తారేమో అని భయపడ్డా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ” అన్నారు.
సునీల్ గారితో నటించాలి అని ఎప్పటి నుండో కోరిక ఉండేది… ఒక మంచి రోల్ చేస్తే ఆయనతో కలిసి చేయాలి అనిపించేది. అది ఈ సినిమాతో నాకు తీరింది.
“వచ్చే 2025 సంవత్సరం 4 సినిమాలు రాబోతున్నాయి, అందరికి మేన్స్ డే శుభకాంక్షలు” విశ్వక్ అన్నారు..
మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై రవి తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంజు పిల్లలమర్రి
Also Read This : రాకేశ్‌ను ముప్పతిప్పలు పెట్టిన చలాకి చంటి…