Pushpa-2 :
నేను తెలుగు నటుణ్ని మాత్రమే కాదు భారతదేశపు నటుడిని అని చెప్పి తనను తాను క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా
బీహార్‌లో తన ‘పుష్ప’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చేసి సంపూర్ణమైన విజయాన్ని సాధించాడు అల్లు అర్జున్.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ పుష్ప ఎవరి దగ్గర తగ్గేదేలే…కానీ బీహార్‌కి మొదటిసారిగా వచ్చిన నా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు మాత్రం తగ్గుతున్నాను.
‘పుష్ప’ అంటే ఫైర్ అని మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు ‘పుష్ప–2’ సినిమాలో పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్‌ఫైర్’’ అన్నారు.
2 నిమిషాల 47సెకండ్ల ట్రైలర్‌తో ప్రేక్షకులందరికి ఈ సినిమాను థియేటర్‌లో చూడకపోతే ఏం మిస్సవుతామో అనే విధంగా ట్రైలర్ ఉందంటే అతిశయోక్తి కాదేమో.
అంతగొప్పగా సినిమా ట్రైలర్‌ను కట్‌చేశారు గ్రేట్ మ్యాథమ్యాటికల్ డైరెక్టర్ సుకుమార్.
ఈ ఈవెంట్ తర్వాత… నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ తన రేంజ్‌ని చెప్పటంకోసం ట్రైలర్‌లో డైలాగ్‌లా చెప్పి మాస్టర్‌స్ట్రోక్ కొట్టాడు బన్నీ… శివమల్లాల
Also Read This : కరుంగలి మాల విశిష్టత ఏంటి? ఆ మాలకు ధైవత్వం ఉంటుందా?