మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎంగేజింగ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియన్ సినిమా మ్యూజికల్ మ్యాన్ ఎస్.ఎస్ తమన్. నవంబర్ 16 ఆయన పుట్టినరోజు. తమన్ చిన్నప్పుడు తన ఉండే కాలనీలో ఏ పిల్లాడిదైనా పుట్టినరోజు వచ్చిందంటే ఆ రోజు తమన్‌కి పండగే. కారణం ఏంటంటే అక్కడ తమన్ తన డోల్‌తో మ్యూజిక్ చేస్తే 20 రూపాయలు ఇచ్చేవారట. అందుకే తమన్ ఎవరి పుట్టినరోజు వస్తుందా అని ఎప్పుడూ ఎదురుచూసేవాడట. అలాంటి తమన్ ఆడియోకి ఇప్పుడు మార్కెట్ ఎంతో తెలిస్తే ఆశ్యర్యపోతారు. తాను సంగీతం చేసే ఒక్కో సినిమాకి దాదాపు పదికోట్ల రూపాయల ఆడియో మార్కెట్ ఉందంటే అతిశయోక్తి కాదేమో. వచ్చే రెండు నెలలు తమన్‌వే. పుష్ప–2 సినిమాకి చాలామంది సంగీత దర్శకులు సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అల్లు అర్జున్ ‘పుష్ప–2’ సినిమాకి కొంతభాగం వర్క్ చేస్తున్నారు తమన్. అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రానున్న ‘గేమ్‌చేంజర్’ , బాబి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ‘డాక్ మహారాజు’కి ఆయనే మ్యూజిక్ బజాయిస్తున్నారు. అందుకే రానున్న రెండు నెలల్లో అల్లు అర్జున్, రామ్‌చరణ్, బాలయ్యవంటి టాప్ మాస్ హీరోలతో తమన్ పనిచేయటం ఈ బర్త్‌డే స్పెషల్ అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్ తమన్ అంటూ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్, ట్యాగ్‌తెలుగు.కామ్ వెబ్‌సైట్ తమన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది.
శివమల్లాల
Also Read This :