బలగం వేణు–నితిన్‌ల ‘ఎల్లమ్మ’ సినిమా వచ్చే దసరాకి…
టాలెంట్ ఎవడి చుట్టం కాదు..అది మనలో ఉండాలి అని నిరూపించారు ‘బలగం’ దర్శకుడు వేణు.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణానగర్ రోడ్లమీద నడుస్తూ
అవకాశాలకోసం ఎదురుచూపులు చూస్తుంటే అతన్ని చూసిన సినిమావాళ్లు ఎంతోమంది ఉన్నారు.
ఆరోజు అతన్ని చూసిన చూపుకి అవకాశాలు సంపాదించిన తర్వాత అదే రోడ్లు అదే మనుషులు అతన్ని చూసిన చూపుకి చాలా తేడా ఉంది.
‘బలగం’ తర్వాత తనని చూసిన వారంతా అయ్యబాబోయ్ ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా? అంటూ ఆశ్యర్యపోవటం అందరం గమనించాం.
ప్రస్తుతం వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా నిర్మాణం జరుపుకోబోతుంది. ఆ చిత్రం పేరు ‘ఎల్లమ్మ’. ఆ సినిమా నిర్మాత ‘దిల్’ రాజు.
తనకి దర్శకునిగా అవకాశం ఇచ్చిన రాజుగారికే తన రెండో సినిమా చేస్తూ రుణం తీర్చుకునే పనిలో ఉన్నాడు వేణు.
త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని 2025 దసరాకి విడుదల చేయాలన్నది దిల్‌రాజు గారి ప్లానట.
మొత్తానికి టాలెంట్‌తో పాటు వినయవిధేయతలు ఉంటే ఇండస్ట్రీలో ఏ స్థాయికైనా వెళ్లొచ్చు అని కమెడియన్ వేణు నుండి జబర్ధస్త్ వేణుగా
అటు తర్వాత దర్శకుడు బలగం వేణుగా మారిన వేణుని చూసినవారందరూ కొడితే ఇలా హిట్టు కొట్టాలిరా అంటున్నారు.
శివమల్లాల
Also Read This : సెంట్రల్ మినిస్టర్ కొడుకు సినిమాల్లోకి రావడానికి కారణం ?