Anushka Shetty :
అందం, అభినయంతో పాటు తెలివితేటలు, మంచితనం కలిసున్న ఒక హీరోయిన్ ఉంటే ఆమె పేరు స్వీటి.
ముద్దు పేరు స్వీటీ అసలు పేరు అనుష్క అనుకుంటారు. కానీ అనుష్క ఆమె అసలు పేరు కాదు. ఆమె అసలు పేరు స్వీటి.
vఅనుష్క అని ఆమెకు పేరు పెట్టింది ది గ్రేట్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ పూరి జగన్నాద్‌గారు.
‘‘సూపర్’’ సినిమాతో సిల్వర్‌స్కీన్‌కి ఎంట్రీ ఇచ్చిన స్వీటి నాగార్జున గారు ఇచ్చిన సపోర్టుతో టాలీవుడ్‌లో పెద్ద విజయాన్ని దక్కించుకుని వరుస ఆఫర్లతో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంది.
ఆ తర్వాత రాజమౌళి గారు దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’ సినిమాలో అవకాశం దక్కించుకుని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
ఆ చిత్రం విడుదలైన తర్వాత తన కెరీర్‌కు రాజమార్గానికి బాటలు వేసుకుంది ఈ బెంగుళూరు భామ.
‘‘అరుంధతి’’ చిత్రంతో జేజెమ్మగా ప్రేక్షకుల మధిలో నిలిచిపోయింది అనుష్క.
ఆ చిత్రానికి మొదట అనుకున్న హీరోయిన్ అనుష్క కాదు. కానీ అటుతిరిగి ఇటుతిరిగి వచ్చి ఆ పాత్ర ఆమెను వరించింది.
ఆ సినిమా తర్వాత ఆమెకు తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి వంటి ప్రిస్టేజియస్ అవార్డును దక్కించుకుంది అనుష్క.
‘బిల్లా’ సినిమాతో ప్రభాస్‌తో నటించిన తర్వాత వారిద్దరి కలయికలో అనేక సినిమాలు వచ్చాయి.
అందుకే వారిద్దరూ ఎవర్‌గ్రీన్ బ్యూటిఫుల్ పెయిర్‌గా నిలబడటంతో పాటు వారిద్దరికి ఏదో ఉంది అని అనేక గుసగుసలు వినిపించాయి.
ఇదే విషయాన్ని అనుష్కతో అంటే చాలా సింపుల్‌గా ఆన్సర్ చెప్పేసి నవ్వేసేది.
ఆమె గురించి వ్యక్తిగతంగా తెలిసిన ఎవరికైనా నిలువెత్తు మంచితనం అనుష్క అంటుంటారు.
ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జర్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ అనుష్క గురించి
కంటెంట్‌తో కూడిన ఒక వీడియోను ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్ విడుదల చేసింది. కంటెంట్ బై శివమల్లాల
Also Read This : భగవద్గీత చేయడానికి కారణం ఇదే…