ఆ లెటర్‌వల్ల వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మ క్షోభించదా?

మూడు పేజిల ఒక లెటర్‌వల్ల రాష్ట్రం మొత్తం చర్చించుకుంటున్నారు. ప్రపంచంలోని తెలుగు వారందరూ ఈ విషయంలో తప్పెవరిదై ఉంటుంది? అని మాట్లాడుకుంటున్నారు.

ఎవరి గురించి ఇదంతా…ఏ లెటర్‌ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా.

ఆస్తుల గురించి కొట్లాడుకుంటున్న అన్నా చెల్లెలు టాపిక్‌లో రాజకీయం ఎంట్రీ ఇవ్వటంతో ఏంచేయాలో పాలుపోని ఓ తల్లి లెటర్‌ రూపంలో ఆస్తుల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆ లెటర్‌ రాసింది వైయస్‌.విజయమ్మ గారైతే ఆ అన్నా చెల్లెలు వైయస్‌ జగన్‌గారు, షర్మిలగార్లు.

ఆ లెటర్‌వల్ల వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మ క్షోభించదా? చిన్న ఇళ్లల్లో ఆస్తుల గొడవలైతే పంచాయితీలు చేయటానికి వాళ్లు వీళ్లు వచ్చి ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్‌ పడుతుందిలే అనుకోవచ్చు.

మరి ఈ గొడవకు ఫుల్‌స్టాప్‌ ఎక్కడ? విజయమ్మ లెటర్‌తో గొడవలన్నీ సద్దుమణుగుతాయా? జగన్‌గారిది తప్పా? షర్మిలగారిది తప్పా?

విజయమ్మగారు ఎందుకు మాట్లాడితే షర్మిలగారి తరపున ఉండి మాట్లాడుతున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తటంతో ఆమె లెటర్‌ను విడుదల చేసినట్లున్నారు.

అందుకే ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ ఛానల్‌ వీటన్నింటి గురించి ఓ వీడియో విడుదల చేసింది.

ఆ వీడియోలో అనేక ప్రశ్నలను అడుగుతూ ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూస్తుంది ట్యాగ్‌తెలుగు. ఆ వీడియోను మీరు ఓ సారి చూసేయండి?

శివమల్లాల

Also Read This : క్విట్‌ అండ్‌ క్వైట్‌ శ్రీకాంత్‌ అయ్యంగార్‌….

YS Family
YS Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *