Unstoppable 4 : బాల చంద్రులకు సూటి ప్రశ్నలు

Unstoppable 4 :

అన్‌స్టాపబుల్‌ సీజన్‌4 స్టార్టింగ్‌ ఎపిసోడ్‌ విశ్లేషణ…

అన్‌స్టాపబుల్‌ సీజన్‌4 స్టార్టింగ్‌ ఎపిసోడ్‌ మ్యాజికల్‌ మ్యాన్‌ చంద్రబాబునాయుడు గారితో షురూ అయ్యింది.

‘ఆహా’లో స్ట్రీమింగ్‌ జరుగుతున్న ఈ ప్రిస్టేజియస్‌ టాక్‌ షోకు ఊహించని అతిథులను తీసుకువచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఆహా యూనిట్‌.

ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈ షోకు మాస్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా

ముందుండి నడపటంతోనే ఈ షోకు అందాన్ని హుందాని తీసుకుకొచ్చింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అమ్మో బాలకృష్ణకు కోపమెక్కువట ? చీటికి మాటికి ఫ్యాన్స్‌ను కొడతారట? తన స్టాఫ్‌తో పాటు సినిమా యూనిట్‌ మొత్తానికి బాలయ్య బాబు అంటే చాలా భయమట.

నిజమేనా? ఇలాంటి ప్రశ్నలు బాలకృష్ణ గారి గురించి ఆనోట, ఈనోట రెగ్యులర్‌గా వినిపించే మాటలే.

వినిపించే అంటే అవన్ని నిజాలు కావా? అని అందరు అనుకోవచ్చు. అవన్నీ నిజాలో, కాదో చూసినవారికి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తాయి.

సామాన్య ప్రేక్షకునికి వాటన్నింటితో ఏం సంబంధం…అందుకే ఇలాంటి వాటన్నింటికి సమాధానంగా బాలయ్యబాబు తన వ్యక్తిగతాన్ని,

వృత్తిగతాన్ని కంబైండ్‌ చేసి మిక్సీలో వేసి తీసిన జ్యూస్‌లాంటి షో నే అన్‌స్టాపబుల్‌.

మొదటి సీజన్‌లోనే నందమూరి వారసుడు యాంకర్‌గా చేసి అందరిచేత శహభాష్‌ అనిపించుకోవటమే కాకుండా నిజజీవితంలో తన లైఫ్‌ ఎంత లైవ్లీగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు.

ప్రతి ఒక్కరికి తనతో ఎలాంటి బంధాలు, అనుబంధాలు ఉన్నాయి అని వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్‌తో తను మాట్లాడిన తీరుతో ప్రేక్షకులు ఆ షోను చూడటాన్ని హాబిగా చేసుకున్నారు.

ఆ షోను అతితక్కువ కాలంలోనే అందలం ఎక్కించారు. ఓ రకంగా ఆ షో వల్లనే ఆహా ఓటిటి చానల్‌కి నిండుదనం వచ్చింది అనుకోవచ్చు.

ఆహాకు కొత్త సబ్‌స్క్రైబర్స్‌ ఈ షో ద్వారా యాడ్‌ అయ్యారంటే అతిశయోక్తి కాదేమో.

అంతలా పాపులారిటి సంపాదించుకున్న ఈ షో భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిన గొప్ప షోస్‌లో ఒకటిగా మిగిలింది.

ముఖ్యంగా ‘అన్‌స్టాపబుల్‌’ షో 4వ సీజన్‌లోకి ఎంట్రీ ఇస్తూనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారితో తమ తొలి షోను మొదలెట్టింది.

ఈ షోలో భాగంగా అనేక ప్రశ్నలను బాలయ్య తనదైన స్టైల్లో ప్రశ్నలను సంధిస్తూ బావ బావ అంటూ జవాబులు రాబట్టే ప్రయత్నం చేశారు.

ఈ షోలోని కంటెంట్‌ ఫస్ట్‌హాప్‌ అంతా ఎమోషనల్‌ డ్రైవ్‌గా ఉంటూ చంద్రబాబు 53రోజుల జైలు జీవితానికి సంబంధించినది కాగా, సెకండ్‌ హాఫ్‌లో నారా లోకేశ్‌ గారి గురించి మాట్లాడారు.

సరే ఈ షోలో మాట్లాడిన కంటెంట్‌కి ప్రజలవద్దనుండి పాజిటివ్‌గా,నెగిటివ్‌గా రెండు రకాల రియాక్షన్లు ఉండొచ్చు .

దానికి కారణం ఒకే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, యం.ఎల్‌.ఏ అనేది ఒక కారణమైతే రెండో కారణం వారిద్దరు బావ–బావమరిది కావటం.

ఏదేమైనప్పటికి వారు ప్రపంచానికి చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు.

కొన్ని విషయాల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నపుడు పార్టీలకు అతీతంగా తెలియకుండానే ఎమోషనల్‌ అవుతారు.

సామాన్య ప్రజానికంలో ఉన్న ఎన్నో సమాధానం లేని ప్రశ్నలకు ఈ షోద్వారా చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబుగారు.

ముఖ్యంగా ఈ షో చూసిన తర్వాత వచ్చిన ప్రశ్నలు ఇవి….

1. అన్‌స్టాపబుల్‌ షో ద్వారా ఏపిలో రాజకీయం గురించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పటానికి టాక్‌ షోను ఉపయోగించుకున్నారా?

2. ఈ షో ద్వారా చంద్రబాబు గారు పదేపదే తెలుగువారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాను అని చెప్పారు.

రాష్ట్రాలు విడిపోయాక ఏపికి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారేకదా. అప్పుడు జరగని వృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారు?

3. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో వెనకపడిందని బాబుగారే చెప్పారు. అందుకే గతంలో విజన్‌ 20–20 అన్న బాబుగారు ఇప్పుడు స్లోగన్‌ని 2047కి మార్చటానికి కారణాలు ఏంటి?

4. నారాలోకేశ్‌గారి గురించి పదేపదే బావ–బావమరిది ఇద్దరు మాట్లాడుకోవటం వెనుక అసలు కథ ఏంటి?

5. రాబోయే రోజుల్లో టిడిపి అధికారంలోకి వస్తే లోకేశ్‌గారే ముఖ్య నాయకుడు అని చెప్పటమే ఈ షో ఉద్ధేశ్యమా?

6. కూటమి వల్లే గెలిచారు అని అందరికి తెలిసిన విషయమే? అలాంటప్పుడు పవన్‌ కల్యాణ్‌ టాపిక్‌ని ఎందుకు రెండు ప్రశ్నలకే పరిమితం చేశారు?

7. ఈ షోను 53రోజుల చంద్రబాబు జైలు జీవితాన్ని హైలెట్‌ చేయటానికి వాడుకున్నారా?

8. అన్‌స్టాపబుల్‌ 3వ సీజన్‌ను మూడే మూడు ఎపిసోడ్లతో సడెన్‌గా ఆఫ్‌చేసిన ఆహా ఇప్పుడు మరో సీజన్‌తో ముందుకు రావటానికి కారణం ఏంటి?

ఈ సీజన్‌ కూడా మూడు ఎపిసోడ్‌లతో ముగుస్తుందా?

9. పదవి లేనప్పుడు బాబుగారితో రెండు ఎపిసోడ్లు చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వగానే మరో ఎపిసోడ్‌ ఎందుకు చేశారబ్బా?

గతంలో ఒక్కగెస్ట్‌ను కూడా ఈ ప్రోగ్రాంలో రిపీట్‌ చేయలేదు? ఈ షోను చూసిన ప్రేక్షకులు ఇలాంటి మరెన్నో ప్రశ్నలను సంధిస్తున్నారు.

ఎందుకైనా మంచిది ఓ సారి ఈ షోను మీరు చూస్తే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పొచ్చేమో చెక్‌చేయండి? ఈ షో ఎలా ఉంది? రివ్యూ ఏంటి?

అని ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌లో ఉన్న జన్యూన్‌ రివ్యూ బై శివమల్లాల రివ్యూలో చూసేయండి………..

   శివమల్లాల

Also Read This : ప్రభాస్‌ రియల్‌ అండ్‌ రీల్‌ స్టోరి…..

Unstoppable 4 With NBK
Unstoppable 4 With NBK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *