Bommarillu Bhaskar :
ఆరెంజ్ ప్లాప్ తరువాత ఏం జరిగింది
తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2006 వ సంవత్సరానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.
ఒక కొత్త దర్శకుడు చిన్న కథను తన కథనంతో చాలా పెద్దగా చెప్పి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ చిన్న కథను నమ్మి పెద్దగా చేసినవాడు భాస్కర్.
సినిమా పేరు బొమ్మరిల్లు. అంతే ఆ సినిమా సాధించిన విజయంతో ఆ సినిమాకు పనిచేసిన నటీనటులు సాంకేతిక నిపుణులు ఎంతోమంది ఒక్క ఫ్రైడేతో పెద్దవాళ్లయ్యారు.
ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ కథకు కనెక్ట్ అయ్యి సినిమాకు ఎమోషనల్గా ఆ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజుకు కమర్షియల్గా సక్సెస్ ను కట్టబెట్టారు.
భాస్కర్ ఇంటిపేరు ఎవరికి తెలియకుండా పోయింది. బొమ్మరిల్లు ఇంటిపేరై గత 18 ఏళ్లుగా అలానే పిలిపించుకుంటున్నారు.
18 ఏళ్లలో ఆయన తీసిన సినిమాలు వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. 6 సినిమాలు మాత్రమే భాస్కర్ ఇప్పటివరకు తెరకెక్కించారు.
దసరా స్పెషల్ సందర్భంగా ఈ కూల్ పర్సన్ను ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది.
ఇంటర్వ్యూలో ఆయన చాలా సందర్భాల్లో ఘాటుగా స్పందించారు. ఎందుకు మీ లెక్క తప్పింది అని అడిగినప్పుడు నా లెక్క ఎప్పడు తప్పదు.
నేను చాలా కరెక్టుగా లెక్కేసుకుని సినిమాలు చేస్తున్నాను. మరో 5 కథలు సిద్ధంగా ఉన్నాయి అంటూ ప్రస్తుతం
టిల్లు బాయ్ సిద్దు జొన్నలగడ్డతో చేస్తున్న జాక్ సినిమా గురించి బోలెడు కబుర్లు చెప్పాడు. ఆ కబుర్లేంటో మీరు ఓ లుక్కేయండి. ఇంటర్వ్యూ బై శివ మల్లాల.
Also Read This : ఇద్దరి మెగా స్టార్లను కలిసిన సందీప్ రెడ్డి వంగా.