...

Prana Prathista : ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటి ?

Prana Prathista :

ఒకొక్క ప్రశ్నకు సమాధానం వెదుక్కుంటూ వెళదాము. మొదట ఈ ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఏమిటో చూద్దాము.

ఏదైనా ఆలయంలో మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆగమాలను అనుసరిస్తారు.

ఆగమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో ఉపయోగించే విధానాలు.. మంత్ర యంత్ర తంత్రాలు.

ముందుగా ఈ మంత్ర, యంత్ర తంత్రాల గురించి తెలుసుకుందాం. మంత్రం ఇది సౌండ్ ఎనర్జీకి సంబంధించినది.

మంత్రం ద్వారా ఆ విగ్రహంలో మరియు ఆ ప్రాంగణంలో సౌండ్ ఎనర్జీని ప్రవేశ పెట్టడం జరుగుతుంది. యంత్రం ఇది ఎనర్జీని తీసుకుని ఎనర్జీని ఇచ్చే ప్రక్రియ.

దీనికోసం అనేక లోహాలను, మణులను, వివిధ వస్తువులను వాడతారు.

ఇది ఒక బ్యాటరీలాంటిది అనుకుంటే మంత్రాల ద్వారా బ్యాటరీ చార్జ్ చేయబడుతుంది. అది అక్కడకు వచ్చినవారికి దానిలోని శక్తిని విడుదల చేస్తుంది. ఇక మూడవదైన తంత్రం.

రెండు విధాల ద్వారా ఆ విగ్రహం

తన్ అంటే శరీరం… శరీరంనుండి ప్రాణ శక్తిని పైన చెప్పిన రెండు విధాల ద్వారా ఆ విగ్రహంలో ప్రవేశపెడతారు. అక్కడ జరిగే హోమాలు, హోమం చేసేవారు, యజమానులు వీరినుండి ప్రాణ శక్తి ఆ విగ్రహానికి చేరుతుంది.

అందుకే ఈ ప్రక్రియ జరిపేవారు, జరిపించేవారు అత్యంత నిష్టతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదాహరణకు మోడీగారిని తీసుకుంటే ఆయన 11రోజులు దీక్షలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

 

ఆయన అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడి శక్తిని తనలోకి తీసుకుని ప్రాణ ప్రతిష్ట

అంతే కాకుండా ఆయన అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడి శక్తిని తనలోకి తీసుకుని ప్రాణ ప్రతిష్టకు వస్తున్నారు. ఆయన దర్శించిన స్థలాలలో కొన్ని శ్రీరామచంద్రుడు తిరిగిన స్ధలాలు, ప్రతిష్టచేసిన స్ధలాలు.

ఈ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినుండి విగ్రహానికి ప్రాణశక్తి బదలీ అవుతుంది. ఆ విగ్రహం వారినుండి ఇది కోరుకుంటుంది.

ఈ కార్యక్రమం తరువాత ప్రాణ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత ఆ విగ్రహాన్ని దర్శించినవారినుండి కొంత యనర్జీనితీసుకుని కొంత ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది.

అందుకే మన దేవాలయాలకు అంత ప్రాధాన్యత. ఆ శిలలో ఉన్న అణువులు. ఆ శిల క్రింద ఏర్పరచిన లోహాలు, మణులు, యంత్రాలు, వాటిలో నింపిన సౌండ్ ఎనర్జీ ఇవన్నీ కలసి ఆ శిలను దర్శించినవారిలో చాలా మార్పులు తీసుకువస్తాయి. ఇటువంటి శక్తి ప్రకృతిలో కూడా ఉంటుంది.

ఆ ప్రదేశాలను దర్శించినప్పుడు కూడా ఇటువంటి మార్పులు దర్శించినవారిలో వస్తాయి.

మరొక ఉదాహరణ చూద్దాం. కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించిన కొందరు పరిశోధకులు, కొందరు పర్వతారోహకుల అనుభవాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

వారి గోళ్ళుపెరగడం, జుట్టుపెరగడం, త్వరగా ముసలి తనం రావడానికి ఇవి గుర్తులు. అలాటి ప్రదేశాలకు వెళ్లాలంటే సాధనచేసి వెళ్ళడం మంచిది.

కైలాష్ ను దర్శించినవారిలో కూడా అనేక ఆధ్యాత్మిక మార్పులను మనం గమనించవచ్చు.

 

Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…

 

 

Latest News Of Electrol Bonds
Electrol Bonds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.