Raghu Thatha :
ఓటిటి : జీ5
విడుదల తేది : 13–09–2024
నటీనటులు : కీర్తిసురేశ్, రవీంధ్ర విజయ్, యం.ఎస్ భాస్కర్, దేవదర్శిని, రాజీవ్ రవీంధ్రనాధన్
సినిమాటోగ్రఫీ : యామిని యజ్ఞమూర్తి
సంగీతం : సీన్ రోల్డన్
నిర్మాత : విజయ్ కిరంగదూర్
కథ– కధనం–దర్శకత్వం : సుమన్
కథ :
‘రఘుతాత’ సినిమా 1970ల నాటి కథ. ఆ రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో హిందీ భాషని ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చి తమిళులంతా హిందీ వాడాలని అనుకుంటాడు ఓ పెద్దమనిషి.
ఆ భాషను తప్పనిసరిగా నేర్చుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుందని ప్రచారం చేసేవారికి తమిళభాష మీద విపరీతమైన ప్రేమ ఉన్నవారికి మధ్య జరిగే చిన్నపాటి సంఘర్షణను హాస్యాన్ని జోడిస్తూ
అప్పర్ డివిజన్ క్లర్క్‌గా కాపా పెన్ నేమ్‌తో కథలు రాసే రచయిత్రి (కీర్తి సురేశ్) కోణంలో కథను చూపించే ప్రయత్నమే ‘రఘుతాత’ సినిమా.
దర్శకుడు సుమన్‌కుమార్ తను అనుకున్న కథను ఎటువంటి స్టార్ ఇమేజ్‌కి పోకుండా నిజాయితీగా కథ చెప్పారు అనిపించింది.
హిందీ భాషే కాకుండా సినిమాలోని ప్రధానమైన కాన్‌ప్లిక్ట్ కీర్తిసురేశ్ పెళ్లి.
ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ కథను ఎంత బాగా నడిపించాడు అన్నట్లుగా సినిమా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
నటీనటుల పనితీరు :
కీర్తిసురేశ్ నటన గురించి మనం ఈ రోజు చెప్పుకోవాల్సిన అవసరం లేనేలేదు.
ముఖ్యంగా 1970ల కాలం నాటి కథ కావటంతో కీర్తి బ్యాంక్ ఉద్యోగిగా మరియు రచయిత్రిగా రెండు పార్శా్వలు ఉన్న పాత్ర కావటంతో ఆమెవరకు ఆమె చాలా హుందాగా నటించారు.
అలాగే ఆమెతో పాటు ఇంజనీరు పాత్రలో నటించిన రవీంధ్ర విజయ్‌కి (తమిళసెల్వన్) కూడా మంచి మార్కులే పడ్డాయి.
ముఖ్యంగా తాను ప్రవర్తించే పద్ధతి సగటు ప్రేక్షకుణ్ని విస్మయానికి గురి చేస్తుంది. బయటకు ఒకలా కనిపిస్తూ లోపల మరోలా నటించటం అంటూ కత్తి మీద సాములాంటిదే.
అలాంటి పాత్రను అలవోకగా చేసేశారు విజయ్.
ఇద్దరు నటీనటులు పోటి పడి నటించటంతో పాటు రఘుతాతగా నటించిన సీనియర్ నటుడు యం. ఎస్ భాస్కర్ నటన దేవదర్శిని పాత్రలు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు.
టెక్నికల్ విభాగం : సంగీతం చక్కగా కుదిరింది. దర్శకుడు ఈ కథకు ఎంత కావాలో అంత రాబట్టుకున్నారు. కెమెరా వర్క్ చూడముచ్చటగా ఉంది.
అన్నిటికంటే ముఖ్యంగా 1970లనాటి వాతావరణాన్ని కళ్లముందుకు తీసుకువచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభని ఖచ్చితంగా కొనియాడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
కథ కథను నడిపిన విధానం
నటీనటుల పనితీరు
ఆర్ట్ డైరెక్టర్ పనితనం
మైనస్ పాయింట్స్ :
చిన్న కథ
కాన్‌ఫ్లిక్ట్ పెద్దది కాకపోవటం
కొన్నిసీన్లు చాలా స్లోగా ఉండటం
ఫైనల్ వర్డిక్ట్ :
మహానటి కోసం ఖచ్చితంగా ఓ సారి చూడాల్సిన సినిమా
రేటింగ్ : 3/5
శివమల్లాల
Also Read This : నో లాజిక్ నో మ్యాజిక్….