Malaika Arora :
నటి మలైకా అరోరా ఖాన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ముంబాయిలోని బాంధ్రాలో తన ఇల్లు ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని సమాచారం.
మలైకా మాజీ భర్త సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ సంఘటన స్థలానికి చేరుకుని ఏం జరిగి ఉంటుందని పోలీసులతో పాటు ఆరా తీస్తున్నారని స్థానికులు తెలిపారు.
ఈ సంఘటన జరిగిన సమయంలో మలైకా పూనేలో ఉండగా హుటాహుటిన ముంబాయికి బయలుదేరారు. పోస్ట్‌మార్టం చేసిన తర్వాత శవాన్ని పోలీసులు అప్పచెప్తారట.
మలైకాకి 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తన తల్లితండ్రులు విడిపోయారని ఈ మధ్య ఓ టీవిషోలో ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే.
అనిల్ అరోరా ఆత్మహత్యకి సంబంధించి బాంద్రా క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎటువంటి సూసైడ్‌నోట్ దొరకలేదని త్వరలోనే మిగిలిన వివరాలు తెలియచేస్తాం అన్నారు ముంబాయి పోలీసులు….
Also Read This : అలాంటివారికి నా ఆవేదన అభ్యర్ధన ప్రార్థన….