SS.Rajamouli :
చరిత్ర అంటే పుస్తకాల్లో చదువుకునేది అనుకునేవాడిని నేను. పుస్తకాల్లోనే కాదు మన కళ్లముందు జరిగేది కూడా చరిత్రగా మారుతుంది అని ఈ చరిత్ర చూసిన తర్వాత తెలిసింది.
నా కళ్లతో అలాంటి చరిత్రను చూశాను, కలిశాను, మాట్లాడాను చరిత్ర సృష్టించిన మునుషులతో తిరిగాను. ఇదేంటి ఇతను చరిత్ర అంటూ ఇలా మాట్లాడుతున్నాడు.
ఇంతకి దేనిగురించి ఇతను మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా?
అదేనండి మన తెలుగు దర్శకుడు మన భారతదేశం గర్వించిన దర్శకుడు ప్రపంచం మెచ్చిన దర్శకుడు శ్రీ శ్రీశైల రాజమౌళి గురించి.
ఆయన గురించి ఎంతో గొప్పగా నెట్‌ఫ్లిక్స్‌లో మోడరన్ మాస్టర్స్ ఎస్.ఎస్ రాజమౌళి పేరుతో ఓ డాక్యుమెంటరి విడుదలైంది.
చరిత్ర సృష్టించిన వారి గురించి చరిత్రలో నిలిచిన వాటి గురించి మాత్రమే డాక్యుమెంటరీలు రూపొందిస్తారు. అలాంటిది మన తెలుగువాడు కొవ్వూరు నుండి ఆస్కార్ స్థాయికి ఎలా ఎదిగాడు?
అతను ఎదిగిన క్రమంలో ఎదుగుతున్న దారిలో వచ్చిన అడ్డంకులకు ఎలా చెక్ పెట్టాడు? ప్రొఫెషనలిజాన్ని ఫ్యామిలీతో ముడి పెట్టకూడదు అంటారు..
అలా అయితే రాజమౌళి ఫ్యామిలీ అంతా సినిమాని కుటీర పరిశ్రమ అనుకుందా? సినిమా అంటే కుటుంబంతో పాటు పనిచేసుకుని పొట్ట పోసుకునే ఒక ఆర్టా?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఆయనతో పాటు పనిచేసిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్‌లు ఓ పక్క,
కుటుంబమంతా ఓ పక్క తనగురించి తన కష్టం గురించి మాట్లాడుతుంటే తెలియకుండానే కంటిపొరలో చిన్న చెమ్మ తగులుతుంది.
ముఖ్యంగా కీరవాణి తన తండ్రి సినిమా తీసినప్పుడు ఆ సినిమాను ఎలాగైనా బయటపడేయ్యాలి అనుకున్న సందర్భం అవ్వొచ్చు.
‘బాహుబలి’ విడుదలైనప్పుడు వచ్చిన రివ్యూలవల్ల ఒక రోజంతా సినిమా హిట్టా? ఫట్టా? అర్థంకాక కొడుకు కార్తికేయని పట్టుకొని తల్లడిల్లినప్పుడు
వారి మధ్యన్ను ఎమోషన్ చూస్తే అయ్యబాబోయ్ రాజమౌళికి కూడా ఇన్ని కష్టాలుంటాయా? అంత ఏడుస్తాడా?
అని తన పాయింట్‌లో మన మెదడు ఆలోచిస్తే ఎలా ఉంటుంది….ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత కథ అవుతుంది…
అందుకే ఒక గంట ఇరవై నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని తొందరగా చూసేయండి….ట్యాగ్‌తెలుగు.కామ్ మరియు ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్ ‘మోడరన్ మాస్టర్స్ ఆఫ్ ఎస్.ఎస్ రాజమౌళి’ కి ఇస్తున్న రేటింగ్… 4.25/5
జన్యూన్ రివ్యూ బై శివమల్లాల