Chandrababu Naidu : CBN ఈజ్ బ్యాక్

Chandrababu Naidu :

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నాల్గవసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఎనిమిదిసార్లు యం.ఎల్‌.ఏగా తన సొంత నియోజకవర్గం నుంచి గెలుపొందారాయన.

నారా ప్రమాణస్వీకార మహోత్సవానికి భారతదేశంలో ఉన్న అనేకమంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంధ్రమోడి, కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరి, జె.పి నడ్డాలతో పాటు తెలంగాణా మాజీ గవర్నర్‌ తమిళపైలతో పాటు

సినిమాస్టార్స్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ దంపతులు, మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు ఈ వేదికపై ఉండటం కన్నులపండుగగా ఉంది.

అలాగే పవన్‌కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదికపై ఉన్న పెద్ద వారందరి వద్దకు వెళ్లి ఆశీస్సులు అందుకున్నారు.

పవన్‌ వేదికపై ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి కాళ్లమీద పడి ఆశీర్వాదం తీసుకుకోవటంతో మెగాభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

పవర్‌స్టార్‌పై ఉన్న ప్రేమను మెగాస్టార్‌ తమ్ముడికి ముద్దులు పెట్టి మరి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. దాదాపు 24 మంది మంత్రులు ఈ వేదికపై తమ ప్రమాణస్వీకారాన్ని చేశారు.

విజయవాడ దగ్గరలోని కేశరపల్లి మొత్తం పసుపుమయంగా మారిపోయింది. ట్యాగ్‌తెలుగు.కామ్‌ కొత్త ప్రభుత్వంలోని ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ విశెశ్‌ను తెలియచేస్తుంది.

 

Also Read This Article : ఆయన ఫోటోలున్నాయి… దండలు మాత్రమే కొనాలి… 

AP CBN Oath Ceremony
AP CBN Oath Ceremony

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *