...

Megastar Chiranjeevi :  చిరంజీవి చాలా పెద్ద డ్రగ్‌…..

Megastar Chiranjeevi :

గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న అనేక కథనాలతో చిరంజీవి మరోసారి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు…

జర్నలిస్ట్‌ ప్రభుకి చిరంజీవి సాయం అనేది న్యూస్‌ సారాంశం…

ఆ న్యూస్‌ గురించి వారిద్దరి గురించి చిన్న రైటప్‌…..

స్వార్ధంలేని సినిమా జీవి చిరంజీవి…

శివశంకర వరప్రసాద్‌లు చాలామందే వచ్చారు ఇండస్ట్రీకి…వచ్చిన అందరూ మెగాస్టార్‌లు అవ్వరు…ఆ శివశంకర్‌ మెగాస్టార్‌గా అయ్యాక కూడా నేల విడిచి ఎక్కడ సాము చేయలేదు…

అందుకే మెగాస్టార్‌ అయ్యారు…రోజురోజుకి మెగా మెగా మెగా అవుతూనే ఉన్నాడు….కారణం అయన నేల విడిచి సాము చేయడు కాబట్టి…

ఆయన ఫ్యాన్స్‌కి ఇచ్చిన ఫోటోలు లెక్కకడితే గిన్నిస్‌కి ఎక్కటం ఖాయం… అవి ఎన్ని కోట్ల ఫోటోలు ఉంటాయో? గిన్నిస్‌ బుక్‌ ఎన్నిసార్లు లెక్కెట్టాలో ఆ ఫోటోల్ని..

ఫ్యాన్స్‌ అంటే అంత పిచ్చి చిరంజీవికి..ఫ్యాన్స్‌కి ఎలాగు ఆయనంటే పిచ్చే…కానీ, మెగా రేంజ్‌కి వెళ్లాక కూడా అదే అభిమానం ఉండటం చాలా అరుదు…అతి కొద్ది మందికే ఈ ఫీట్‌ సాధించటం సాధ్యం…

చిరంజీవి ఒక మత్తు మందు…యాంటీ డ్రగ్స్‌ వాళ్లు బ్యాన్‌ చేయలేని మత్తు చిరంజీవి…ఆయనేంటో చూద్దామా అని సరదాగా ఒకసారి ఫాలో అయ్యి ఆయన మత్తులో పడ్డామా..

ఇక మన జీవితం ఆయనకు ఆయన ప్రేమకు బానిసలా మిగిలి పోవాల్సిందే…అంత పెద్ద డ్రగ్‌ ఎడిక్ట్‌ అభిమానులకు చిరంజీవి…

ఎలాంటి వ్యసనం నుండైనా బయటపడొచ్చేమో కానీ ఒకసారి చిరంజీవి అనే మత్తును రుచిచూస్తే జీవిత కాలం ఆ మత్తు ఇంజెక్షన్‌ను ఎక్కించుకుంటూనే ఉంటాం…అది ఆయన..

ఆ మత్తు సినిమా జర్నలిస్ట్‌లను కమ్మేసింది..కారణం ఆయన సినిమా జర్నలిస్ట్‌లకోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు…అవి ఒకటా? రెండా ? వందల్లో ఉంటే ఎన్నని చెప్తాం ఏమని చెప్తాం… అన్నింటిని మాటల్లో›చెప్పలేం.

కారణం ఆయన చేసే సేవలకు లెక్కేలేదు కనుక. మామూలు సమయంలో అయితే ఏముందిలే చిరంజీవి గొప్ప అనే బ్యాచ్‌లు చాలానే చూశాం.

కరోనా సమయంలో ఐతే అరకొర జీతాలతో ఇబ్బందిపడే అనేకమంది జర్నలిస్ట్‌లు జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే నిత్యావసరాలు ప్రతిఒక్కరికి చేరాలి అని ఆలోచించిన నిస్వార్ధ జీవి చిరంజీవి..

కరోనా సమయంలో ఆయనిచ్చిన ఉప్పు, పప్పే ఆసరాగా చేసుకుని బండి నడిపిన 24 శాఖలవారిలో సినిమా జర్నలిస్ట్‌లు కూడా ఉన్నారు.

ఆరోజు చిరంజీవి చేసిన సాయానికి జై చిరంజీవ అనుకోని ఏ జర్నలిస్ట్‌ లేరంటే అతిశయోక్తి కాదేమో… నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అని మనసులో అనుకుని చిరంజీవిని బ్లెస్‌ చేశారు…

అందుకే చిరంజీవి ఒక మత్తు అన్నాను..అలాంటి మత్తును కష్టం వచ్చిన ప్రతిసారి ఇంజెక్షన్‌లా ఇచ్చేస్తాడు చిరంజీవి ఎవరికైనా.

 

ఎవరెవరో తెలియని వారికే ఆయన చేసిన సేవలు అంత మంచిగా అందుతున్నప్పుడు ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారికి సాయపడటంలో ఆశ్చర్యమేముంటుంది.

అలా ఆయనకు వ్యక్తిగతంగా గత 35 ఏళ్లుగా పరిచయమైన జర్నలిస్ట్‌ ప్రభుకు అనారోగ్యం అని తెలిస్తే ఆ మనిషి ఊరుకుంటాడా? ప్రభుకు గుండెంతా చిరునే ఉంటాడు…అలాంటి గుండెకి చిన్న ఆపద వస్తే చిరంజీవి ఏం చేసి ఉంటాడు…

మెగా స్టైల్లో చిన్నపాటి మంత్రమేశాడు. తనకు ఎంతో ఇష్టమైన జర్నలిస్ట్‌ ప్రభుకోసం ఫోన్‌ తీసి ఒక్కటంటే ఒక్కటే కాల్‌ చేసి దిస్‌ ఈజ్‌ చిరు అని స్టార్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ రమేశ్‌గారికి కాల్‌ చేశారాయన..

మెగాస్టార్‌ చేసిన ఒక్క ఫోన్‌ కాల్‌తో ఛూ మంతర్‌ అంటూ ప్రభు నొప్పికి మంత్రం వేసి ఆర్ధికంగాను హార్ధికంగాను ఆదుకున్నారు చిరు.

ప్రభుకు గుండెల్లో ఉన్న బ్లాకేమో గాని బ్లాక్‌బస్టర్‌ హీరో చేసిన మెగా హెల్ప్‌కి ఫిదా అయిపోయాడు ప్రభు. ఎంతో హార్ట్‌ఫుల్‌గా చిరంజీవిని మెచ్చుకుంటూ నవ్వుకుంటూనే హార్ట్‌ ఆపరేషన్కి వెళ్లాడు.

అలా ఆపరేషన్‌ థియేటర్‌కి వెళ్లి ఇలా స్టంట్‌ వేయించుకుని వచ్చేశారు జర్నలిస్ట్‌ ప్రభు. సాయం చేయమని ఎవ్వరడిగినా పరిచయం ఉన్నా లేకపోయినా ఏదో రకంగా వాళ్లకు సాయపడే ప్రభుకు ఆయన చేసిన మాట సాయాలు, సలహాలు ఊరికే పోలేదు.

వాటన్నింటికి బదులుగా దేవుడే సాయం చేశాడా అన్నట్లుగా మెగాస్టార్‌ సాయం చేశారు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లా ఉన్న స్టార్‌ హాస్పిటల్‌లో స్టార్‌ సెటబ్రిటీని చూసుకున్నట్లు చూసుకున్నారు అక్కడి సిబ్బంది అంతా.

అలా వెళ్లిన రెండురోజుల్లో హార్ట్‌ బ్లాక్‌ను తొలగించుకుని స్టంట్‌ వేసుకుని స్టైల్‌గా బట్టలు మార్చుకుని తల దువ్వుకుని ఇంటికి వెళ్లిపోయాడు.

సుమన్‌ టీవిలో ఠీవిగా కూర్చుని ఇంటర్వూ చేయటానికి కెమెరా.. యాక్షన్‌ …రెడీ అంటూ హాయ్‌ నేను మీ జర్నలిస్ట్‌ ప్రభు అంటూ ప్రశ్నల బాణాలు వెయ్యటానికి సిద్ధమాయ్యరు….

ఆపరేషన్‌ రెండు రోజులు గడిచి పరేషాన్‌ అంతా తీరాక ప్రభు ఫ్యామిలీ అంతా జై చిరంజీవి అంటూ జేజేలు పలికారు…..

ట్యాగ్‌తెలుగు విషెశ్‌ యూ హ్యాపీ ఫాస్ట్‌ రికవరి ప్రభుగారు అంటూనే మెగాకు అభినందనలు తెలియచేస్తుంది.
  శివమల్లాల

Also Read This Article : ఒక్క సినిమాతో కంటెంట్‌ ఉన్న కటౌట్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ…

 

Hyper Adhi Exclusive Interview
Hyper Adhi Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.