Jr Ntr Birthday :
‘ రామాయణం’ తో బాల రామునిగా చూశాం…
‘సూడెంట్ నం1’ తో స్టూడెంట్‌గా చూశాం…
‘ఆది’ తో ఫ్యాక్షన్ స్టార్‌గా మారటం చూశాం..
‘సింహాద్రి’ తో హీరో సింహంలా ఎలా ఉంటాడో చూశాం….
‘రాఖీ’ లో మధ్యతరగతి అన్నకి కోపం వస్తే ఏంచేస్తాడో చూశాం…
‘యమదొంగ’లో యముని ఆటపట్టించే చిలిపి దొంగని చూశాం…
‘అదుర్స్’ సినిమాలో బ్రహ్మితో పోటిపడే కామెడి టైమింగ్ చూశాం..
‘దమ్ము’ లో బాధ్యతగా ఉండే హీరో దమ్ముని చూశాం…
‘టెంపర్’లో అడ్డదిడ్డంగా తిరిగే పోలీసాఫీసర్ టెంపర్ ఎలా ఉంటుందో చూశాం..
‘ నాన్నకు ప్రేమతో’ లో నాన్న మీదున్న ప్రేమ లెక్కల్ని చూశాం…
‘జనతా గ్యారేజ్’లో సమాజంలోని ప్రకృతికి ఇవ్వాల్సిన విలువేంటో చూశాం…
‘అరవింద సమేత’లో యుద్ధం చేయటం కాదు, యుద్ధాన్ని ఆపటం ఏట్లనో చూశాం..
‘ఆర్‌ఆర్‌ఆర్’లో దేశంకోసం, దోస్తికోసం ఎలా నిలబడాలో చూశాం…
చూశాం..చూశాం.. చూశాం అంటూ ఇన్ని చూసినా కూడా… నీ రాకకోసం దేశమంతా ‘‘దేవర’’ అంటూ ఎదురు చూస్తూనే ఉంది…నువ్వు రాముడివి కాదు, దేవుడివి కాదు…నువ్వు తెలుగువాడి గర్వానివి….. తెలుగు సినిమా హీరో స్థాయిని పెంచింది పెద్ద ఎన్టీవోడు అయితే….తెలుగు సినిమాని ప్రపంచానికి చూపించి భళిరా భీమ్ అనిపించింది మాత్రం నువ్వే… హుందాతనానికి నిలువెత్తు సాక్షం నువ్వు…మాస్‌కి మసాల నువ్వు…క్లాస్‌కి, క్లాసికల్ డాన్స్‌కి కేరాఫ్ అడ్రస్ నువ్వు…70 యంయం స్క్రీన్‌పై యన్.టి.ఆర్ అని పేరు పడగానే మావాడు అనుకునే ఫీలింగ్ నువ్వు.. అసలు సిసలు తెలుగు హీరోకి సరైన అర్థం నువ్వు..
ట్యాగ్ తెలుగు విషెశ్ యు ఏ వెరీ హ్యాపి బర్త్‌డే టు యూ డియర్ తారక్…..గ్రేట్ ఇయర్ ఎ హెడ్…..
శివమల్లాల
Also Read This : మహేష్ బాబు సినిమాకు కొత్త క్యాస్టింగ్ డైరెక్టర్?