Chanikya ethics :
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనుషులు అనే వారు వారి స్వార్ధాన్ని బట్టి ఎలా ప్రవర్తించినా కూడా మనకంటూ ఒక అవగాహన ఉండాలని, మనలిని ఎవరు ఇష్టపడినా ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది తెలియడం చాలా ముఖ్యమని ఇలా స్త్రీ, పురుషుల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అందులో భాగంగా స్త్రీలు పురుషులలో ఏమి చూసి ఆకర్షితులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం
-
గౌరవం:
తమకు తగిన గౌరవం ఇచ్చే పురుషుల పట్ల మహిళలు సులభంగా ఆకర్షితులవుతారని చాణక్యుడు చెప్పాడు. స్త్రీలందరూ తమ భాగస్వామిని గౌరవించాలని కోరుకుంటారు.
అలాంటి పురుషులు చాలా దృఢంగా ఉంటారు. అవతలి వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వింటారు. కాబట్టి స్త్రీలు తక్షణమే అలాంటి పురుషుల పట్ల ఆకర్షితులవుతారు.
-
నిజాయితీ:
చాణక్యుడు ప్రకారం, స్త్రీలు నిజాయితీ, నమ్మదగిన పురుషులను ఇష్టపడతారు. సాధారణంగా స్త్రీలు అబద్ధాలు చెప్పే మగవాళ్ళను ఇష్టపడరు.
నిజాయితీ గల వ్యక్తి ఎల్లప్పుడూ నిజమైన మార్గాన్ని అనుసరిస్తాడు. అటువంటి పరిస్థితిలో వారు ఎప్పుడూ తప్పు చేయరు.
నిజాయితీ గల పురుషులతో కలిసి జీవించడం వల్ల స్త్రీలు సంతోషంగా ఉంటారు. స్త్రీలు నిజాయితీ గల పురుషుల పట్ల త్వరగా ఆకర్షితులవుతారు.
-
మర్యాద:
చాణక్య నీతి ప్రకారం, స్త్రీలు మర్యాదగల పురుషులను త్వరగా ఇష్టపడతారు. అహంకారం లేని, ఏ తప్పు జరిగినా వినయంతో అంగీకరించే పురుషులు చాలా అరుదు.
పురుషుల ఈ గుణం బంధంలో మధురానుభూతిని తెస్తుందని మహిళలు నమ్ముతారు. మనిషి మొదట మర్యాదగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
-
మంచి ప్రవర్తన:
మంచి నడవడిక ఎవరి మనసునైనా గెలుచుకోగలదని అంటారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాడు.
మహిళలు తరచుగా సాధారణ వ్యక్తిత్వం ఉన్న పురుషులను ఇష్టపడతారు. నిశ్శబ్ద పురుషుల పట్ల మహిళలు చాలా త్వరగా ఆకర్షితులవుతారు. చాణక్య నీతి స్త్రీలు సౌమ్యుడైన వ్యక్తితో ప్రేమలో పడతారని చెప్పారు.
-
ధైర్యం:
మహిళలు ధైర్యవంతులైన పురుషులను ప్రేమిస్తారు. కుక్క తన యజమానికి ఎంత రక్షణగా ఉంటుందో పురుషుడు తన భార్యకు అంతే రక్షణగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఎల్లప్పుడూ భార్యను రక్షించండి. అంతేకాదు ఏదైనా ఉంటే నేరుగా చెప్పేయాలి.
-
శ్రద్ధగా ఉండే స్వభావం:
స్త్రీలు తమ భాగస్వామి తమతో మాట్లాడే విషయాలను శ్రద్ధగా వింటారని, వారి అభిప్రాయాలను గౌరసిమ్చాలని కోరుకుంటారు.
తమ చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా వినే పురుషుల పట్ల మహిళలు త్వరగా ఆకర్షితులవుతారు. అలాంటి పురుషులకు తమ హృదయాల్లో స్త్రీలు సులభంగా చోటు కల్పిస్తారు.
-
అత్మ విశ్వాసం:
ఆత్మ విశ్వాసం కలిగిన పురుషులు ఎల్లప్పుడు గంభీరంగా ఉంటారు. తనను తాను నమ్మే పురుషుడు తన భాగస్వామిని కూడా నమ్ముతాడు అని స్త్రీలు భావిస్తారు. అలాంటి పురుషుడితో బంధం స్థిరంగా ఉంటుంది.
-
బాధ్యతనుని దృఢంగా చేసే వారు:
తన కుటుంబాన్ని నిర్వహించే బాధ్యతను దృఢంగా నిర్వహించే పురుషులు స్త్రీలకు గంభీరంగా కనిపిస్తారు. ఇంటి పట్ల ఆసక్తి చూపించే పురుషుడితో జీవితం ఆనందంగా ఉంటుంది అని స్త్రీలు భావిస్తారు.
-
హాస్య చతురత:
మంచి హాస్య చతురత కలిగిన పురుషుడు ఎల్లప్పుడూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తాడు. జీవితంలోని కష్టాలను మరిచిపోయేలా చేస్తాడు. అటువంటి పురుషుడి సహచర్యం స్త్రీలకు ఇష్టంగా ఉంటుంది.
-
ఉపకారం చేసే మనస్తత్వం:
స్వార్థం లేని, ఎల్లప్పుడు దాన గుణం కలిగిన పురుషులు స్త్రీలకు మంచిగా కనిపిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేసే పురుషుడి ప్రవర్తన స్త్రీల మనసు కుదుపుతుంది.
చాణిక్య నీతి మనకు చెప్పే విషయాలు ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనవి. ఈ సూత్రాలను పాటించడం ద్వారా జీవిత సంబంధాలు మెరుగుపడతాయి. స్త్రీ పురుషుల మధ్య అండర్ స్టాండింగ్ నెలకొల్పుతుంది.
Also Read This : పుచ్చకాయ సాగుతో 80 రోజుల్లోనే రూ.12 లక్షల లాభం
