Raghava Lawrence : ఇది కదా.. సేవ అంటే!

Raghava Lawrence :

రైతులకు 10ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్

సినిమా రంగంలో స్వయం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒకరు. లారెన్స్ ను చాలా మంది అభిమానిస్తారు.

అయితే లారెన్స్ ని అభిమానించడానికి సినిమాలకు మించిన కారణం మరొకటి ఉంది. అదే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు.

కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడిగా అన్నింటిలో తనదైన ముద్ర వేసిన లారెన్స్.. ఇతరులకు సాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు.

దాన గుణంలో ఎప్పుడూ ముందుండే రాఘవ లారెన్స్ తాజాగా మరోసారి తన గొప్ప మనసుని చాటుకొని వార్తల్లో నిలిచారు.

నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా రైతుల కోసం మొదటి విడుతగా 10 ట్రాక్టర్లను అందజేశారు లారెస్స్. ఈ నిస్వార్థ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చేరి మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ మేరకు ‘సేవే దేవుడు’అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ఓ వీడియోని లారెన్స్ పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో లారెన్స్ మాట్లాడుతూ..”ఈ ప్రత్యేకమైన కార్మికుల దినోత్సవం సందర్భంగా మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవే దేవుడు అనే చొరవతో ఈ ప్రత్యేకమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది.

మన దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం మొదటి ప్రారంభంలో 10 ట్రాక్టర్లను నా స్వంత డబ్బుతో అందజేస్తాను.

అవసరంలో ఉన్న సరైన వ్యక్తులకు సేవ చేయడానికి ఈ నిస్వార్థ ప్రయాణంలో అందరూ చేరి మద్దతు ఇవ్వాలి. మాటల కంటే చేతలే ఎక్కువగా మాట్లాడుతుంది.

నా ప్రయాణంలో మీ అందరి మద్దతు, ఆశీస్సులు కావాలి. నేటి నుంచి సేవే దేవుడు మొదలు” అని లారెన్స్ తెలిపారు.

రాఘవ లారెన్స్ పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతనెలలోనే లారెన్స్.. ద్విచక్ర వాహనాలు కొనుగులు చేసి వాటిని త్రీవీలర్స్ గా మార్చి కొంతమంది దివ్యాంగులకు అందజేసిన విషయం తెలిసిందే.

 

Also Read This Article : వియ్యంకుడి కోసం హీరో వెంకటేశ్ ప్రచారం

Srinivas Gavireddy Interview
Srinivas Gavireddy Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *