Prajwal Revanna : ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్

Prajwal Revanna :

లైంగిక వేధింపుల ఆరోపణలతో జేడీఎస్ నిర్ణయం

మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ తనయుడు రేవణ్ణ తో పాటు.. మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లపై లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.

పైగా ఎన్నికల సీజన్ కావడంతో వ్యవహారం మరింత వైరల్ గా మారింది. ఈ సమయంలో… హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రజ్వల్‌ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

అయితే ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఆయన పెన్‌డ్రైవ్‌లో ప్రభుత్వ అధికారులు సహా దాదాపు 3 వేల మంది మహిళల సెక్స్ వీడియోలు ఉండడం, ఆ వీడియోలు బయటకు రావడం సంచలనమైంది.

ఈ నేపథ్యంలో, ప్రజ్వల్ జర్మనీ పారిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. తాజాగా, ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బీజేపీ పెద్దలకు ముందే తెలుసన్న విషయం బయటపడింది.

గతేడాది డిసెంబర్ 8న బీజేపీ నేత దేవరాజె గౌడ.. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు లేఖ రాస్తూ ప్రజ్వల్ సహా దేవెగౌడ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రజ్వల్ పెన్‌‌డ్రైవ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు సహా 2,976 మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నట్టు తెలిపారు. వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

మరో పెన్‌డ్రైవ్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ఉన్నాయని, అవి ఇప్పటికే కాంగ్రెస్‌లోని జాతీయ స్థాయి నేతలకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజ్వల్ తండ్రి కూడా!

మరోవైపు, ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత రేవణ్ణ ఇంటిలో పనిచేసే 47 ఏళ్ల మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది.

ప్రజ్వల్ తోపాటు ఆయన తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ తనను లైంగికంగా హింసించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

దీనిపై మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ… ప్రజ్వల్ పూర్వాపరాలు తెలిసినప్పటికీ, బీజేపీ కార్యకర్తలు లేఖలు రాసినప్పటికీ, ఆయన బాధితులు వేలల్లో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు.

 

Also Read This Article : రేవంత్ ను అరెస్టు చేస్తారా?

Latest News Of Electrol Bonds
Electrol Bonds

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *