Varun Tej :
పిఠాపురంలో ప్రచారం చేయనున్న వరుణ్ తేజ్
ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరఫున ఆయన సోదరుడు నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ పర్యటించనున్నారు. వాస్తవానికి జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఎవరినీ ఆహ్వానించలేదు. పైగా.. మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలను రాజకీయాలకు దూరంగా ఉండాలని కూడా ఆయన సూచించినట్టు తెలిసింది. అయితే… బాబాయ్ పార్టీకి అండగా, బాబాయ్ నియోజకవర్గంలో తానూ ప్రచారం చేయాలని వరుణ్ తేజ్ ముందుకు వచ్చారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.
వరుణ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. పిఠాపురంలో మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రచారం చేయనున్నారని రాజకీయ, సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వినబడుతోంది. అయితే… ఆ ప్రచారంలో నిజం లేదని మెగా ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి. రాజకీయ ప్రచారంలో చిరు పాల్గొనడం లేదని స్పష్టం చేశాయి. అయితే… తమ్ముడికి అన్నయ్య అండదండలు చాలా మెండుగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జనసేన పార్టీకి చిరంజీవి ఇటీవలే 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తనకు కుమారుడు రామ్ చరణ్ తో కూడా మరికొంత ఆర్థిక సహాయం చేయించారు.
Also Read This Articel : గన్ పార్కుకు చేరిన హామీల సవాళ్లు
