Ap Next CM : ఏపీలో మళ్లీ జగనే సీఎం – కేసీఆర్

Ap Next CM :

తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీయే విజయం సాధిస్తుందని, వైఎస్ జగనే తిరిగి సీఎం అవుతారని అన్నారు.

ఓ ప్రముఖ వార్త ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందనే విషయంపై ఆయన వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.

ఇక తన కూతురు , ఎమ్మెల్సీ కవిత అరెస్టు పై కూడా కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అనవసరంగా అమాయకులను శిక్షిస్తున్నారని మండిపడ్డారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అంతా బోగస్‌ అని, ఇదంతా ప్రధాని మోదీ సృష్టేనని ఆరోపించారు.‘‘ లిక్కర్‌ స్కామ్‌లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు.

నా కూతురు కవితకు ఏమి తెలియదు. లిక్కర్‌ స్కామ్‌తో కవితకు ఎలాంటి సంబంధం లేదు.

ఈ కేసులో నా కూతురు కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారు’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డించినదుకే.. రేవంత్‌ రెడ్డి తనపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ ఆరోపించారు.

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని..తాను మరోసారి సీఎంగా పని చేస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇక ఇదే సమయంలో ఏపీ రాజకీయాలపై కూడా ఆయన ఈ సందర్భంగా స్పందించారు. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్‌ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని…

మీ అంచనా ప్రకారం ఏపీలో ఎవరు విజయం సాధిస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇస్తూ.. తనకున్న సమాచారం ప్రకారం ఏపీలో తిరిగి జగన్ అధికారం చేపడతారని ఆయన తెలిపారు.

Also Read This Article : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో 64.61 శాతం ఉత్తీర్ణత

 

Dr. Krovvidi Nirlepa Exclusive Interview
Dr. Krovvidi Nirlepa Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *