Mahua Moitra News :
తృణమూల్ నాయకురాలి వ్యాఖ్యల వక్రీకరణ.. దుమారం
మహువా మొయిత్రా.. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మరోసారి వార్తల్లోకెక్కారు.
గతంలో లోక్ సభలో ప్రధాని మోదీని ఇరుకున పెట్టే ప్రశ్న వేసేందుకు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో మహువా.. పార్లమెంటు సభ్యత్వం రద్దుకు గురైన విషయం తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కొందరు ఎడిట్ చేసి తప్పడు అర్థం వచ్చేలా ప్రచారం చేయడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ లోని కృష్ణానగర్ లోక్ సభ స్ధానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మహువా మొయిత్రా మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.
2019 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి గెలిచిన మహువాపై లోక్ సభలో వివాదం తలెత్తి ఆమెను సభ నుంచి బహిష్కరించినా.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మళ్లీ ఆమెకే టికెట్ ఇచ్చారు.
ఈ క్రమంలో తన లోక్ సభ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న మహువా.. ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూనే ఓ జర్నలిస్ట్ చేసిన ఇంటర్య్వూలో మాట్లాడారు.
ఈ సమయంలో ‘మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటీ?’ అని జర్నలిస్ట్ అడిగారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. ‘ఎగ్స్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అని సమాధానమిచ్చారు.
అయితే ఆ వీడియోలో ఎగ్స్ అనే పదం స్థానంలో కొందరు.. సెక్స్ అని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది.
వైరల్ అయిన వీడియో చివరికి మహువా మొయిత్రాను ఇంటర్య్వూ చేసిన జర్నలిస్ట్ తమల్ సాహా దృష్టికి వచ్చింది. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు.. ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా ట్యాంపర్ చేశారని పేర్కొన్నారు.
‘‘ఇది నా ఇంటర్వ్యూ.. కాబట్టి, నన్ను స్పష్టం చేయనివ్వండి. నేను తృణమూల్ నాయకురాలు మహువా మొయిత్రాను ఇంటర్య్వూ చేశాను.
ఆ సమయంలో మీ శక్తికి మూలం ఏమిటి ప్రశ్నించగా.. మహువా మొయిత్రా . EGGS …,” అని బదులిచ్చారు.
కానీ, కొందరు వ్యక్తులు EGGS ను s*x లాగా వక్రీకరించారు. ఇది తీవ్ర ఆక్షేపణీయం” అని ఆయన అన్నారు. తాను చేసిన ఇంటర్వ్యూ ఒరిజినల్ వీడియో లింక్ ను తన ట్విటర్ (ఎక్స్) ఖాతా పోస్ట్ చేశారు.
Also Read This Article : ఐపీఎల్ కప్ బీజేపీదే.. కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు

Also Read This Article : శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు జప్తు