Health :
ఈరోజుల్లో ప్రతి ఒక్కరిది ఆఫీస్ లైఫ్, ఇంట్లో ఉన్నా కూడా వర్క్ ఫ్రం హోం అని, ఇలా ఎప్పుడు చూసినా కూడా ప్రతి ఒక్కరి ఉద్యోగాలు దాదాపుగా కుర్చుని చేసేవే, మరి అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మనం మన శరీరానికి ఎలాంటి కదలికలు ఇస్తే ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాలు తెలుసుకుందాం. సగటున ఒక ఆఫీస్ టైమింగ్స్ అనేవి కనీసం 9 గంటలు ఉంటుంది. ఇలా అన్ని గంటలు పాటు కూర్చోవడం వలన, అలాంటి జీవన విధానం వలన రక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది వీటి గురించి ఆలోచించకుండా అలా గంటలు గంటలు ఒకటే చోట కూర్చుని కదలకుండా ఉండిపోతారు. దాని వలన అనేక సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యలు రాకుండా ఉండాలి అంటే, ఆఫీస్ లోనే కూర్చుని చేసే ‘యోగా’ ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం.
రిలాక్సేషన్ కోసం..
ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పనిచేస్తే ఒక విధమైన అలసట వస్తుంది. ఇది తొలగిపోవటానికి కుర్చీలో కూర్చునే విశ్రాంతి తీసుకొనే ఆసనం ఒకటుంది. కుర్చీలో నడుమును నిటారుగా ఉంచి…అరిచేతులను తొడలపై ఉంచాలి. మూడు నిమిషాలు కళ్లు మూసుకొని శ్వాస పీల్చి, వదులుతూ ఉండాలి. ఇలా రోజుకు కనీసం రెండు సార్లు చేస్తే అలసట తొలగిపోయి, తిరిగి ఉత్సాహాన్ని పుంజుకుంటారు.
నడుము నొప్పి పోవాలంటే..
నడుము నెప్పి పోవాలంటే ముందు ఉన్న డెస్క్‌పై చేతులు ఉంచాలి. తల పైకెత్తి నడుమును ముందుకు వంచాలి. పది సెకన్ల తర్వాత నడమును లోపలికి వంచి తలను డిస్క్ వైపు వచ్చేలా వంచాలి. ఇలా పది సార్లు చేస్తే నడుము నెప్పికి కొంత ఉపశమనం లభిస్తుంది.
అరచేయి.. మోచేతి నొప్పులు పోవాలంటే
పిడికిలి బిగించి చేతిని ముందుకు చాపాలి. పిడికిలిని గుండ్రంగా ఎడమవైపునకు.. ఆ తర్వాత కుడివైపునకు తిప్పాలి. ఇలా పది సార్లు చేసిన తర్వాత రెండు చేతులను ముందుకు చాపి అరిచేతి భాగం ముందకు వచ్చేలా వేళ్లను లాక్ చేయాలి. ఇలా చేతులను ముందుకు.. వెనక్కు కదపాలి. ఇలా పది సార్లు చేయాలి. ఈ రెండు ఎక్సర్‌సైజ్‌ల వల్ల చేతుల నొప్పులు తగ్గుతాయి.
తొడ కండరాల కోసం..
ఎక్కువ సేపు కుర్చీలో కదలకుండా కూర్చుంటే తొడ కండరాలు బిగిసుకుపోతాయి. ఈ ఇబ్బందిని తొలగించటానికి– కుర్చీలో నిటారుగా కూర్చుని.. ఎడమ కాలి మడమను కుడి కాలి తొడపై పెట్టాలి. ఆ తర్వాత కళ్లు మూసుకొని 7 నుంచి 10 సార్లు ఊపిరి పీల్చుకుని వదలాలి. ఇలా చేస్తే తొడ కండరాలపై ఒత్తిడి తొలగిపోతుంది. ప్రతి రోజు ఇలాంటి వ్యాయామాలు చెయ్యడం వలన, అనారోగ్య సమస్యలు సంగతి పక్కన పెడితే, స్ట్రెస్ తగ్గి ఆరోగ్యంగా, రెట్టింపు ఉత్సాహంతో, చుర్రుగ్గా ఉంటారు.
Also Read This Article : సమ్మర్ లో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే.. మంచి చిట్కాలు
Also Read This Article : సినిమా రివ్యూలను అడ్డుకోవాల్సిందేనా?