Health Tips :
రెండు రోజులుగా వాతావరణం కొంచం ప్రజల మీద కనికరించింది, మొన్నటి వరుకు ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి.
రానున్న రోజుల్లో కూడా ఆ తీవ్రత స్థాయి పరిగే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎండ విశ్వరూపం చూపిస్తున్నప్పుడు దాని తాకిడికి మనం తట్టుకోవాలి అంటే, శరీరంలో నీటిశాతం అధికంగా ఉండాలి, అలా అని నీళ్ళు మాత్రమే తాగినా ఉపయోగం లేదు.
కొన్ని సందర్భాల్లో శరీరంలో నీటిశాతం మరీ తగ్గిపోవడం వలన వడ దెబ్బ కొట్టే అవకాశం కూడా ఉంది. అందుకనే వేసవిలో ఎప్పుడూ కూడా బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
మరి అలా హైడ్రేటెడ్ గా ఉండాలి అంటే కేవలం నీరు తాగితే సరిపోతుందా? అసలు సరిపోదు.
అందుకే మీకోసం శరీరాన్ని ఆరోగ్యంగా, పేద, మధ్య తరగతి వారికి కూడా అందుబాటులో ఉండే ఈ 3 న్యాచురల్ డ్రింక్స్
నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్ “సి” ఉంటుంది, ఇది శరీరానికి చాలా మంచి యాంటి ఆక్సిడెంట్ ఇస్తుంది, ఈ యాంటి ఆక్సిడెంట్ వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది, కాకపోతే చాలా మంది చేసే చిన్న తప్పు నిమ్మరసాన్ని, స్వీట్ లేదా మసాలాతో తాగడానికి ఇష్టపడతారు.
కాని నిజానికి మనం నిమ్మరసంలో సాల్ట్ వేసుకుంటే, ఆ ఉప్పు వల్ల మన శరీరం ఎక్కువ సేపు హైడ్రేట్ అయ్యి ఉంటుంది.
మంచి నీరు తాగినా కూడా వేసవి వేడికి చెమట రూపంలో ఆ నీరు మొత్తం బయటకి వచ్చేస్తుంది, అదే నీటిలో కొంచం ఉప్పు వేసుకుని తాగితే ఆ నీరు శరీరంలో ఎక్కువ సేపు నిల్వ ఉండి, శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
కొబ్బరి నీళ్ళు:
వేసవిలో ఈ కొబ్బరి నీళ్ళు ధరలు ఆకాశానికి అందుతాయి, నిజానికి సిటీస్ లో ఇంకొంచం ఎక్కువ రెట్లు ఉంటాయి. ఈ కొబ్బరి నీరులో హైడ్రోలైట్స్, అనేక మినరల్స్ సమూహం ఉంటాయి.
వేసవిలో బయట నుండి వేడి రావడం అనేది ఎంత అనివార్యమో, లోపల నుండి వేడి బయటకి పోవడం కూడా అంతే అనివార్యం.
శరీరంలో ఉండే ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కొబ్బరి నీళ్ళు చాలా దోహదపడుతాయి.
ఇందులో కూడా సాధారణంగా తియ్యగా ఉండే నీరు తాగడానికి ఇష్టపడతారు చాలా మంది, కాని నిజానికి లేత బొండాల్లో ఉండే నీరు తియ్యగా ఉండదు కాని శరీర ఉష్నోగ్రతలను తగ్గించాలన్నా, సమతూల్యం చెయ్యాలన్నా ఆ లేత కొబ్బరి నీళ్ళకే సాధ్యం.
మజ్జిగ:
వేసవి కాలంలో చాలా మందికి ఇషామైన డ్రింక్ ఈ మజ్జిగ. ఇందులో రుచి కోసం, అల్లం, పొదీన, సన్నగా తరిగిన మిర్చి ఇవన్ని కూడా వేసుకుని తాగుతారు.
అలా చెయ్యడం వలన వేసవిలో మన శరీరం హైడ్రేట్ అయ్యి ఉంటుంది కాని, చాలా మంది మజ్జిగని చిక్కగా చేసుకుని తాగితారు. అంటే నీటిశాతం కొంచం తక్కువగా ఉంటుంది.
నిజానికి మజ్జిగలో పెరుగు తక్కువ, నీరు ఎక్కువ కలిపి చిలికే మజ్జిగ వేసవిలో సరైన ఆరోగ్య ఫలితాలని ఇస్తుంది. వీలైనంత వరుకు మజ్జిగని ఉప్పుతోనే తాగడానికి ప్రయత్నిస్తే ఫలితం ఇంకాస్త మెరుగుగా ఉంటుంది.
కచ్చితంగా ఈ మూడు డ్రింక్స్ తాగి ఈ వేసవి వేడి నుండి మిమ్మలిని మీరు రక్షించుకోండి.
మీకొక టిప్:
సమ్మర్ వేడికి చల్లటి నీరు తాగే అలవాటు అందరికీ ఉంటుంది, కాని వీలైతే ఫ్రిడ్జ్ నీరు తాగడం ఆపేసి కుండలో నీరు తాగడానికి ప్రయత్నించండి, ఎందుకంటె చల్లటి నీరు శరీరం లోపల నుండి వేడిని ఉత్పత్తి చేస్తుంది.
Also Read This Article : ‘నేను బాధితురాలిని.. నాకు న్యాయం కావాలి’
Also Read This Article :