Geethanjali Malli Vachindi Review :
విడుదల తేది– 11–4–2024
నటీనటులు– అంజలి, శ్రీనివాస రెడ్డి, అలీ, సత్య, రాహుల్, సత్యం రాజేశ్, షకలక శంకర్, రవిశంకర్, రావురమేశ్ తదితరులు
ఎడిటర్– ఛోటా కె ప్రసాద్
సంగీతం– ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత– కోన వెంకట్, యం.వి.వి సత్యనారాయణ
దర్శకత్వం– శివ తుర్లపాటి
కథ–
2014 లో వచ్చిన గీతాంజలి సినిమా కొనసాగింపే ఈ సినిమా. అమాయకుంగా ఉండే సత్య తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఎలాగైనా సరే తన కాబోయో మామగారిని ఒప్పించాలి అనుకుంటాడు. తన మామ సమాజంలో మంచి పేరున్న వాడికే తన కూతురిని ఇస్తాను అనటంతో హీరో అయ్యి చూపిస్తాను అంటూ చాలెంజ్ చేసి హైదరాబాద్‌కి ఎంట్రీ ఇస్తాడు. లాటరీలు కొట్టి ఏ రోజుకి ఆ రోజు గడిపేసే శ్రీనివాసరెడ్డి ఎలాగైనా సినిమా డైరెక్షన్ చేయటం కోసం తన ఫ్రెండ్‌ని హీరోగా పెట్టి సినిమా తీస్తాను అంటాడు. ఇటువంటి సమయంలో శ్రీనివాసరెడ్డికి ఒక నిర్మాత నుండి ఫోన్ వస్తుంది. తనతోనే సినిమా తీయాలి అనుకుంటున్నట్లు చెప్పటంతో ఆనందంతో శ్రీనివాసరెడ్డి అండ్ టీమ్ నిర్మాతను కలుస్తారు. అసలు ఆ నిర్మాత ఎవరు? నిజంగానే సినిమా తీస్తాడా? వీళ్లతోనే సినిమా తీస్తాను అని అతను ఎందుకు చెప్పాడు? అనేది సిల్వర్‌స్క్రీన్‌పై చూస్తే మజా వస్తుంది.
నటీనటుల పనితీరు–
అంజలి 50వ సినిమా కావంటతో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కోసం అంజలి బాగానే కష్టపడింది అని చెప్పాలి. శ్రీనివాసరెడ్డి చిన్న క్యారెక్టర్ చేసినా కూడా తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. అటువంటిది ఈ కామెడి హారర్ మూవీలో తన స్టైల్లో ప్రేక్షకులను బాగానే నవ్వించారు. కమెడియన్ సత్య అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్‌ని నిలబెట్టేశాడు అని చెప్పొచ్చు. అంతమంచిగా తన కామెడి టైమింగ్ కుదిరింది. నటుడు రవిశంకర్, సునీల్, అలీలు తమ పాత్రల మేరకు చాలా బాగా నటించారు.
టెక్నికల్ విభాగం– ప్రవీణ్ లక్కరాజు బ్యాక్‌గ్రౌండ్ స్కార్ ఈ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ . అలాగే కెమెరా పనీతుకూడా బావుంది. ఎడిటింగ్ ఫస్ట్‌హాప్‌లో కొంచెం ట్రిమ్ చేసుంటే బావుండేది. మాటల రచయితగా కోన వెంకట్ చెలరేగిపోయారు.
ప్లస్ పాయింట్స్–
సత్య కామెడి టైమింగ్
అంజలి, శ్రీనివాసరెడ్డి, రవిశంకర్, సునీల్‌ల నటన
డైలాగ్స్, స్క్రీన్‌ప్లే
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్–
ఫస్ట్‌హాఫ్ స్లో పేస్‌లో ఉంది.
కొన్ని లాజిక్స్ మిస్
ఫైనల్ వర్డిక్ట్– ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేసే హారర్ కామెడి (వన్ టైమ్ వాచ్)
రేటింగ్–3/5
శివమల్లాల
Also Read This Article : పుట్టడమే స్టార్ గా పుట్టినా, సరైన హిట్టు లేని హీరో