...

BRS Corruption : కడియం చేతిలో బీఆర్ఎస్ అవినీతి చిట్టా?

BRS Corruption :

వాటిని బయట పెడితే తట్టుకోలేరంటున్న శ్రీహరి

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న అవినీతికి సీనియర్ నేత కడియం శ్రీహరి సాక్షిగా ఉన్నారా? అవినీతికి పాల్పడ్డ వారందరి చిట్టాలు ఆయన వద్ద ఉన్నాయా? కడియం నోరు విప్పితే బీఆర్ఎస్ లో కీలక నేతలకు ఇబ్బందులు తప్పవా? అంటే అవునని శ్రీహరే స్వయంగా అంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన కడియంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుండడంతో ఆయన ఇలా స్పందించారు. ‘‘బీఆర్‌ఎస్‌ నేతలు అందరి చిట్టాలు నా వద్ద ఉన్నాయి. వాటిని బయటపెడితే తట్టుకోలేరు. నాపై విమర్శలు చేస్తున్న వారి చరిత్ర అంతా నాకు తెలుసు’’ అని కడియం అన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడటం బాధగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరక తప్పలేదని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరాల చిట్టాను ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ విప్పుతున్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక నేరాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. ప్రత్యేకించి.. ఫోన్ ట్యాపింగ్ స్కాం ద్వారా బీఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతి చిట్టాను బయటకు తీసే పనిలో ఉంది. రాలు కోర్టుల్లో రుజువు కావడానికి అప్రూవర్ లు ముఖ్య భూమిక వహిస్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేయడంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు. వీరిలో 80 ఏళ్లు దాటిన కె. కేశవరావు వంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు.

బీఆర్ఎస్ ఆనుపానులన్నీ ఈ ముఖ్య నేతలకు తెలుసు. అయితే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ను పల్లెత్తు మాట అనడంలేదు. కానీ, బీఆర్ఎస్ అవినీతి పాలనపైనే మాట్లాడుతున్నారు. కడియం వంటి నేతలు బీఆర్ఎస్ స్కాంల వల్ల తన కూతురు బలి కావొద్దన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెబుతున్నారు.

రాజకీయాల్లో కొత్తగా చేరిన తన కూతురు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని కడియంకు అర్థమైంది కాబట్టే తనతోపాటు కూతురును కాంగ్రెస్ లో చేర్చారు. కాంగ్రెస్ లో చేరిన వెంటనే అదే వరంగల్ టికెట్ తెచ్చుకున్నారు. డిసెంబర్ లో కాంగ్రెస పార్టీ పై ఒంటికాలితో లేచిన కడియం చివరకు అదే పార్టీ చేరారు. కేవలం మూడు నెలల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో విపరీత మార్పు చోటు చేసుకుంది. మెజారిటీ బీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు.

 

తనపై విమర్శలు చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్

కేసీఆర్ మాదిరిగానే రేవంత్ సర్కార్ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పిన నేతల్లో కడియం ముందు వరసలో ఉన్నారు. కేసీఆర్ పై విమర్శలు చేయదలుచుకోలేదని కడియం ఇప్పటికే క్లారిటి ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ నేతలు పదుల సంఖ్యలో పార్టీ మారుతున్నా ఎవరిపైనా స్పందించని బీఆర్ఎస్ నేతలు కడియంపై ఫోకస్ పెట్టారు. అందరిననీ వదిలేసి తనను మాత్రం ఎందుకు టార్గెట్ చేసినట్లు మాట్లాడుతున్నారని కడియం ప్రశ్నిస్తున్నారు. తన విషయంలో వారు మాట్లాడే పద్దతి బాగోలేదన్నారు.

జిల్లా స్థాయి నేతలు కూడా తనపై అనవసర కామెంట్స్‌ చేయడాన్ని కడియం ఖండిస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పాలకుర్తి ప్రజలు చీకొట్టినా బుద్ధి రాలేదని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని కడియం ఎద్దేవా చేశారు. అహంకారపు మాటలు తగ్గించుకుంటే ఆయనకే మంచిదని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ కు ఇలాంటి దుస్థితి రావడానికి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వంటి నేతలే కారణమని కడియం ఆరోపించారు. పల్లా చేసినవన్నీ అసత్య ఆరోపణలేనని కొట్టిపారేశారు.

పల్లా ఆరోపణలకు ఆధారాలు చూపించకుంటే ఆయనను జనగామలో బట్టలు ఊడదీసి నిలబెడతానని కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్‌కు కూడా కడియం వార్నింగ్‌ ఇచ్చారు. మానుకొండూరు ప్రజలు చిత్తుగా ఓడించినా బుద్ధి లేకుండా అనవసర మాటలు మాట్లాడుతున్నాడని కడియం మండిపడ్డారు.

 

Also Read This Article : నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ కు ఎదురుగాలి ?

 

EVM
EVM

Also Read This Article : కవితకు బెయిల్ కష్టమేనా? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.