Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం మూవీ ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని జనవరి 12న విడుదల కానుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, జగపతి బాబు, జయరాం తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈమూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.
ముఖ్యంగా ఈ ట్రైలర్ యొక్క ఈవెంట్ ని మహేష్ బాబు అడ్డా అయిన హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్ ఎమ్ థియేటర్ లో ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేయగా వందలాది ఫ్యాన్స్ హాజరై ట్రైలర్ ని సక్సెస్ చేసారు.
ఇక గుంటూరు కారం ట్రైలర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ మాస్ యాక్షన్ లుక్స్, స్వాగ్, డైలాగ్స్ అన్ని కూడా అదిరిపోయాయి.

అలానే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న గుంటూరు కారం ట్రైలర్ మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు విపరీతంగా పెంచేసింది.
మహేష్ బాబు తల్లితండ్రులుగా ఈ మూవీలో జయరాం, రమ్యకృష్ణ నటిస్తుండగా విలన్ గా జగపతిబాబు కనిపించనున్నారు.
ఇక చాలా ఏళ్ళ తరువాత మహేష్ బాబు ఊర మాస్ పాత్ర చేస్తుండడం అలానే అందరూ ఆయనని ఎలాగైనా చూడాలి అనుకుంటున్నారో
అచ్చంగా అదే మాదిరిగా త్రివిక్రమ్ కూడా ఈ మూవీలో ప్రెజెంట్ చేసినట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతోంది.
ఇక చాలా ఏళ్ళ తో మహేష్ బాబుతో తాను చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్.
మహేష్ బాబు పాత్ర మాత్రమే కాదు కథ కథనాలు పరంగా ప్రతి ఒక్క విషయమై ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారట.
మొత్తంగా గుంటూరు కారం ట్రైలర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తుండడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరి జనవరి 12న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానున్న గుంటూరు కారం ఏ రేంజ్ సక్సెస్ సొంతము చేసుకుంటుందో చూడాలి.
Also Read:UCC bill : ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు