Tillu Square Review :
విడుదల తేది : 29–03–2024
నటీనటులు : సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్, మురళీధర్ గౌడ్, ప్రిన్స్, మరళీశర్మ , అనీష్ కురువిల్లా తదితరులు
ఎడిటర్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : సాయిప్రకాశ్ ఉమ్మడిసింగ్
సంగీతం : రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల భీమ్స్ సిసిరిలియో
నిర్మాత : నాగవంశీ సూర్యదేవర
దర్శకత్వం : మల్లిక్‌రామ్
కథ :
‘డిజె టిల్లు ’ తో సంచలనం సృష్టించిన బాలగంగాధర్ తిలక్ వరుఫ్ సిద్ధు జొన్నలగడ్డ సేమ్ జానర్‌తో ‘టిల్లు స్క్వేర్’ అంటూ మరోసారి ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. డిజె టిల్లు కొనసాగొంపుగా వచ్చిన ఈ టిల్లు స్వే్కర్‌లో కూడా మళ్లీ దాదాపు సేమ్ కథను రిపీట్ చేశారనే చెప్పాలి. అందుకే ఈ సినిమా కథ పెద్దగా చెప్పుకోవటానికి ఏమి లేదు. మొదటి సినిమాలో డిజె కొట్టే టిల్లు ఈ టిల్లు స్క్వేర్‌లో మాత్రం కొంచెం స్థాయి పెంచి ఈవెంట్ మేనేజర్ లెవెల్‌కి వెళ్లి బిజినెస్ చేస్తుంటాడు. అంతా బావుంది అని అనుకునే టైమ్‌లో సడెన్గా పార్టీలో దర్శనమిస్తుంది లిల్లీ (అనుపమా). ఇదే సమయంలో టిల్లు పుట్టినరోజు వస్తుంది. ఈ సారైనా పుట్టినరోజుకి టిల్లుని బయటకు వెళ్లనీయకుండా ఇంట్లో వాళ్లు తలుపులు లాక్ వేసి టిల్లును ఇంట్లో ఉండమంటారు. అయినా కూడా వాళ్ల మాట కాదని టిల్లు బయటకు వెళతాడు. అక్కడనుండి మరలా మొదటి సినిమాలో ఉన్న ఎపిసోడ్ సేమ్ టు సేమ్ అన్నట్లుగా రిపీట్ అవుతుంది. అక్కడనుండి ఏం జరుగుతుంది అనేది మిగతా కథ. కథ పరంగా కొన్ని సినిమాలను చూడలేం. కథనానికి పెద్ద పీటవేస్తూ కొన్ని సినిమాలు వస్తుంటాయి. అలాంటి కథే ఈ టిల్లు స్క్వేర్..
నటీనటుల పనితీరు :
సిద్ధు జొన్నలగడ్డ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా తన డైలాగ్ డిక్షన్, గెటప్‌లతో పేక్షకులను ఎంతో ఎంటర్‌టైన్ చేశాడు టిల్లు. తన పంచ్ డైలాగ్‌ల పవర్ చూపించాడు. అనుపమా పరమేశ్వరన్‌ని చూడగానే మాత్రం కొంచెం షాక్‌కి గురవుతారు ఏ పేక్షకుడైనా. కారణం ఏంటంటే తాను ఏ రేంజ్ పెర్‌ఫార్మరో అందరికి తెలుసు. కానీ, ఈ సినిమాలో ఆమె అభినయంతో పాటు, గ్లామర్ డోస్‌ను కూడా పెంచేశారు. లిల్లీ ఎంత రేంజ్‌లో రెచ్చిపోయిందంటే ఆమె సిదుక్దు పెట్టే లిప్‌కిస్‌లను లెక్క పెట్టటం ప్రేక్షకుల వల్ల కాలేదు. ఆమె జోరు చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మరళీధర్ గౌడ్ పాత్రకు మాత్రం కొంచెం ప్రమోషన్ వచ్చినట్లు అనిపించింది.
టెక్నికల్ విభాగం– మ్యూజిక్‌తో టిల్లుస్క్వేర్ మ్యాజిక్ చేశారు. రీ–రికార్డింగ్, పాటలు బావున్నాయి. కెమెరా వర్క్ చేసిన సాయిప్రకాశ్ తన టాలెంట్‌ను సరిగ్గా ఉపయోగించుకున్నారు. ఎడిటర్ నవీన్ నూలికి ఈ సినిమాలో రెండు సినిమాలలోని కంటెంట్‌ని కలిపి చాలా మంచి అవుట్‌పుట్‌ని ఇచ్చాడు. మంచి మార్కులు కొట్టేశాడు.
ప్లస్ పాయింట్స్ :
డైలాగ్స్, గెటప్స్
నటీనటుల పనితీరు
సంగీతం, కెమెరా వర్క్, ఎడిటింగ్
మైనస్ పాయింట్స్ :
కొన్నిసార్లు సేమ్ డిజే టిల్లు సినిమా చూస్తున్నామా అన్నట్లుగా ఉంటుంది.
కొన్ని క్యారెక్టర్స్ ఎలివేట్ చేయలేదు..
ఫైనల్ వర్డిక్ట్ :
ఎంటర్‌టైన్ అయ్యేవాడికి ఎంటర్‌టైన్ అయినంత…
రేటింగ్ : 3 / 5
శివమల్లాల
Also Read This Article : టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్ మీడియా ప్రారంభం…
Also Read This Article : సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ