...

Razakar Review :  సమీక్ష రజాకర్‌

Razakar Review :

విడుదల తేది : మార్చి 15, 2024
నటీనటులు : మకరం దేశ్‌పాండే, రాజ్‌ అర్జున్‌ , తేజ్‌ సవ్రూ బాబిసింహా, రవిప్రకాశ్, అనసూయ భరద్వాజ్, వేదిక, ఇంద్రజ, ప్రేమ తదితరులు
ఎడిటర్‌ :  తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ : కుషేంధర్‌ రమేశ్‌ రెడ్డి
సంగీతం : భీమ్స్‌ సిసిరొలియో
నిర్మాత : గూడూరు నారాయణ రెడ్డి
కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం : యాటా సత్యనారాయణ

రజాకార్‌ కథ :

224 సంవత్సరాలపాటు హైదరాబాద్‌ను పలిపాలించిన నిజాం నవాబుల కథ. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నిజాం రాజుగా ఉన్న కాలంలో ఆగస్ట్‌ 15 1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. హైదరాబాద్‌ రాష్ట్రానికి మాత్రం అప్పటికి విముక్తి రాలేదు. దానికి కారణం అప్పటి నిజాం పాలకుల మొండివైఖరి. ఆ సమయంలో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు అత్యంత ఆత్మీయంగా ఉండే రాజకీయ నాయకుడు ఖాసిం రజ్వీ రజాకార్‌ అనే మిలటరీని నిజాం ప్రభుత్వంలో ప్రవేశ పెట్టాడు. ఆ సమయంలో తెలంగాణా రాష్ట్రాంలోని ప్రజలు నిజాం ప్రభువుకి పన్నులు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డారు. వీళ్లు చేసిన అనేక రకాలైన దారుణాలని చవిచూశారు.

ఎంతోమంది హిందువులను ముస్లిం మతంలోకి మార్చారు. అలా మతం మారని వాళ్లని భయపెట్టి బలవంతం చేసి చంపేశారు. వీళ్ల చేష్టలకు ఎంతోమంది హిందువులు తమ మాన ప్రాణాలను కోల్పోయారు. ఇదంతా అందరికి తెలిసిన హిస్టరీనే. అయినప్పటికి ఎంతో గొప్ప సాహసంతో తమకు అందుబాటులో ఉన్న ఎన్నో కథలను ఈ సినిమాలో చెప్పారు దర్శకులు యాటా సత్యనారాయణ అండ్‌ టీమ్‌. ఆ టైమ్‌లో భారత ప్రభుత్వ హోమ్‌ మినిష్టర్‌గా ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తెలంగాణ కోసం ఏం చేశారు? నిజాం లొంగిపోవటం కోసం ఎటువంటి ప్రయత్నం చేశారు అనే ఎమోషనల్‌ డ్రామాను సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూడాల్సిందే.

నటీనటుల పనితీరు

నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాత్రలో నటించిన మకరంద్‌ దేశ్‌పాండే, ఖాసింరజ్వీగా నటించిన రాజ్‌అర్జున్‌లు సినిమాలో విలన్లుగా నటించినప్పటికి వారు నటించిన విధానానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతగా వారి నటన ఆకట్టుకుంది. తొలిషాట్‌లోనే ఐలమ్మ పాత్రలో నటించిన ఇంద్రజ, తర్వాత అనేక పాత్రల ద్వారా నటించిన అనసూయ భరద్వాజ్, ప్రేమ, వేదిక, మహేశ్, సీనియర్‌ నటి తులసి ఇలా చాలామంది పేరున్న దాదాపు ముప్పై మంది నటులు తమ పాత్రల పరిధి మేరకు ఎంతో గొప్పగా నటించారు. వారందరూ ఎంతో గొప్పగా నటించే నటులవ్వటంతోనే సినిమా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యింది.

టెక్నికల్‌ విభాగం రమేశ్‌ రెడ్డి ఫోటోగ్రఫీతో ఎన్నో ఎమోషన్స్‌ బలంగా చూపించగలిగారు. ఇటువంటి హిస్టరీని చూపించే కథలో కెమెరామెన్‌ పాత్ర ఎంతో కీలకం. రమేశ్‌ వర్క్‌ సినిమాకి వన్‌ ఆఫ్‌ ది హైలైట్‌ అని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు భీమ్స్‌ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కారణం ఏంటంటే ఒక ఎమోషన్‌ను నెక్ట్స్‌ లెవెల్‌లో పొట్రే చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఇంపార్టెంట్‌. తన పనిని తాను ఎంతో గొప్పగా చేశారు భీమ్స్‌. ఎడిటర్‌ తమ్మిరాజు, ఫైట్‌మాస్టర్స్, డాన్స్‌ మాస్టర్స్‌ ప్రత్యేకించి స్వర్ణ మాస్టర్‌ అద్భుతంగా పనిచేశారు.

ప్లస్‌ పాయింట్స్‌

నటీనటుల పనితీరు
కథకథనం
ఫైట్స్‌ను కొత్తగా డిజైన్‌ చేశారు.
ఎమోషనల్‌ కంటెంట్‌
బతుకమ్మ సాంగ్,

మైనస్‌ పాయింట్స్‌

కమ్యూనిస్ట్‌ల ప్రస్తావన అస్సలు లేకపోవటం
త్యాగం చేసిన వారిని కరెక్ట్‌గా చెప్పకపోవటం

ఫైనల్‌ వర్డిక్ట్‌

ఘోరకలిని ఆనంద భాష్పాలతో చూడటం…..

రేటింగ్‌ : 3.75/ 5

శివమల్లాల

 

Razakar Review
Razakar Review

Also Read This Article : శారీ సైకాలాజికల్ థ్రిల్లర్ : ఆర్జీవీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.