Vyooham Review :
విడుదల తేది– మార్చి 2, 2024
నటీనటులు– అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, సురభి ప్రభావతి, ధనుంజయ్ ప్రభునే, కోట జయరాం, వాసు ఇంటూరి,
ఎడిటర్– మనీష్ ఠాగూర్
సినిమాటోగ్రఫీ– సజీస్ రాజేంద్రన్
సంగీతం– కీర్తన, ఆనంద్
నిర్మాత– రామదూత క్రియేషన్స్
దాసరి కిరణ్ కుమార్
దర్శకత్వం– రామ్‌గోపాల్ వర్మ
కథ :
2009లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ మరణంతో మొదలైన ఈ సినిమా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి 2019లో సీయంగా ప్రమాణ స్వీకారం చేయటం వరకు ఉంటుంది. క్లుప్తంగా ఇది వైయస్ జగన్ పదేళ్ల కాలానికి సంబంధించిన బయోపిక్ అని చెప్పొచ్చు. హైకమాండ్‌కి ఎదురు తిరిగి జగన్ తీసుకున్న కీలక నిర్ణయం ఓదార్పు యాత్రఅని ఆ సమయంలో జగన్ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది? మొదట్నించి జగన్ పక్కన సాన్నిహిత్యంగా మెలిగిన వారెవరు? చంద్రబాబు, పవన్ కల్యాణ్ జగన్ చర్యలకు ఎలాంటి వ్యూహాలు రచించారు అనేది అందరికి తెలిసిన కథే. అయినటప్పటికి ఎవరికి తెలియని కొన్ని కొత్త కోణాలను వైయస్ భారతీ రూపంలో చెప్పించారు దర్శకుడు. అందరికి తెలిసిన కథని తెరపై కొత్తగా చూపించటమే ఈ చిత్రంలోని ప్రధానమైన సవాల్ అని చెప్పొచ్చు. ఫైనల్‌గా ఈ కథకి ముగింపు ఏమిటి? ఎలా తీశాడు అనేది థియేటర్‌లో చూస్తే బావుంటుంది.
నటీనటుల పనితీరు :
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్, భారతీ పాత్రలో మానస ఇద్దరు కేరళీయన్‌లను తెలుగు తెరకు తీసుకొచ్చి అచ్చు గుద్దినట్లు వారిని అనుకరించే విధంగా తర్ఫీదు ఇవ్వటంతో నిజంగా జగన్, భారతీలు ఇలానే ఉంటారు కదా అనే భ్రమలోకి తీసుకెళ్లారు దర్శకుడు . ఇకపోతే చంద్రబాబు పాత్రను చేసిన ధనుంజయ్ ప్రభునే అయితే నిజంగా చంద్రబాబుని తలపించే విధంగా ఉన్నాడు. కొన్నిపార్లు సినిమా చూస్తున్నప్పుడు నిజంగా చంద్రబాబునే చూపిస్తున్నారా అన్నట్లుగా ఉంది. షర్మిల పాత్ర, విజయమ్మ పాత్రలు కూడా దాదాపుగా దగ్గరిగానే ఉన్నాయి. కొణిజేటి రోశయ్య పాత్ర వై.వి సుబ్బారెడ్డి పాత్రలో ‘బలగం’ ఫేమ్ కోట జయరాంకూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
టెక్నికల్ విభాగం :
సాంకేతిక నిపుణుల పనితీరు బాగుంది. ముఖ్యంగా ఎడిటర్ మనీష్ తన కత్తెరకు చక్కగా పదును పెట్టి కట్ చేయటంతో చాలా ఫాస్ట్‌గా సినిమా మూవ్ అయ్యింది. అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఇకపోతే సాంగ్స్, బ్రాక్‌గ్రౌండ్ స్కోర్ పరవాలేదనిపించాయి.
ప్లస్ పాయింట్స్ :
కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జగన్ ఎవరి మాటను లెక్క చేయడు అన్నట్లు ఉండే జగన్ ఎవరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నాడు అనే పాయింట్..
వైయస్ మరణానంతరం ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ ఓదార్పు యాత్ర కోసం ఎలా నిలబడ్డాడు..
నటీనటులు అచ్చు గుద్దినట్లు పోలి ఉండటం ఈ సినిమాకు ప్లస్ పెద్ద ప్లస్.
మైనస్ పాయింట్స్ :
మంచి ఎమోషనల్ కంటెంట్ చూస్తున్నప్పుడు సడెన్‌గా పవన్‌ని ఎటకారం చేస్తూ అమాయకంగా చూపించటం.
సినిమాకు అవసరమే లేకుండా పనికట్టుకుని లోకేశ్‌ని పప్పుగా తప్పుగా చూపించే ప్రయత్నం చేయటం.
అర్ధం లేని పాటలు పెట్టి వైయస్‌ఆర్‌సిపి పార్టీని ప్రమోట్ చేయలనుకోవటం. రోటీన్ పొలిటికల్ సీన్స్..
ఫైనల్ వర్డిక్ట్ :
వైయస్‌ఆర్ మనుషులకి నవ్వు చంద్రబాబు మనుషులకి ఏడుపు
రేటింగ్– 2.75/ 5
Also Read This : AP Political News:24-24-24 జనసేన తొలి లిస్ట్ లో విశేషం.