AP Political News:24-24-24 జనసేన తొలి లిస్ట్ లో విశేషం.

AP Political News:

ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతుండగా ఎప్పటిలాగే ఏపీలో అధికార వైసీపీ మరోసారి ఒంటరిగానే సిద్ధం అంటోంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పొత్తును మరింత బలోపేతం చేస్తూ తొలి జాబితా విడుదల చేశాయి. మూడు రోజుల కిందట అంటే..

ఈ నెల 24న టీడీపీ 94 సీట్లకు, జనసేన 5 సీట్లకు అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి. ఇక మలి జాబితాపై కసరత్తుకు సిద్ధం అవుతున్నాయి. మొత్తం 24 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లను జన సేనకు ఇచ్చారు. బీజేపీ కూడా కలిసి వచ్చాక ఈ కూటమి పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించే చాన్సుంది. తద్వారా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయనుంది అనే స్పష్టత రానుంది.

అన్నీ ఒకేలా..

శనివారం మంచి రోజు కావడంతో ఈ నెల 24న ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి సీట్ల సర్డుబాటును ప్రకటించారు. అయితే, ఇందులో ఓ విశేషం గమనించాల్సి ఉంది. 24వ తేదీన పొత్తులో భాగంగా 24 సీట్లకు పోటీ చేయనున్నట్లు జన సేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇక ఈ ఏడాది కూడా 2024 కావడం గమనార్హం.

వాస్తవానికి పొత్తులో బీజేపీని మినహాయించి జనసేన 40పైగా సీట్లు కోరుతుందని అందరూ భావించారు. పవన్, జనసేన అభిమానులు కూడా ఇదే కాంక్షించారు. కానీ, వ్యూహాత్మకంగా 24 సీట్లతో సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

పొత్తుతో తొలిసారి

ఎన్నికలకు ముందు 2014లో జనసేనను పవన్ కల్యాణ్ స్థాపించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆ పార్టీగానీ, ఆయనగానీ పోటీకి దిగలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే, తర్వాత టీడీపీ ప్రభుత్వం తీరుతో పవన్ విభేదించారు.

2019లో సొంతంగా పోటీ చేశారు. అటు టీడీపీ కూడా బీజేపీ పొత్తు లేకుండా బరిలో దిగింది. ఫలితాలు చూస్తే పవన్ రెండు చోట్లా (భీమవరం, గాజువాక) ఓటమిపాలయ్యారు. జనసేన ఒక్కటే స్థానం (రాజోలు)తో సరిపెట్టుకుంది. ఆ ఎమ్మెల్యే కూడా తర్వాత వైసీపీలో చేరడం వేరే సంగతి. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.

ఇక శనివారం ఐదుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే జన సేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించగా పవన్ ఇలా చేయడం ఏమిటన్న ప్రశ్న వచ్చింది. అయితే, 5 పవన్ కల్యాణ్ లక్కీ నంబర్ అని అందుకే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారని చెబుతున్నారు.

 

ALSO READ:AP POLITICS NEWS:వంగవీటి వారసుడికి సీటు లేద

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *