యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా “చిరంజీవి”. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. “చిరంజీవి” సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యష్ మిట్టల్ మాట్లాడుతూ : మా కికు “చిరంజీవి” సినిమా సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు రాబోతోంది. ఈ నెల 28న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు

కొరియోగ్రాఫర్ గోవింద్ మాట్లాడుతూ : ఈ సినిమా నాకొక పెద్ద అవకాశంగా భావిస్తున్నా. ఈ చిత్రంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాం. సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

డీవోపీ రామకృష్ణ మాట్లాడుతూ : కికు “చిరంజీవి” సినిమాను ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు. అంత థ్రిల్లింగ్ గా సినిమా మొత్తం ఉంటుంది. ఈ చిత్రానికి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ గిరీష్ మాట్లాడుతూ : ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్లు సినిమా తీసి చూడు అని చెప్పాలి. ఈ సినిమా కోసం కికు చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి ఫలితంగా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ : ఈ నెల 28న మా సినిమా రిలీజ్ కు వస్తోంది. తెలుగు ఆడియెన్స్ తెలుగు సినిమాలను చూసేందుకు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నా. ఈ చిత్రానికి కికు అన్నీ తానై చూసుకున్నాడు. కొత్తదనం నిండిన సినిమాగా కికు “చిరంజీవి” మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ : ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక్క నిమిషం కూడా మీరు చూపు తిప్పుకోకుండా ఎంగేజ్ చేసేలా ఉంటుంది. కికు, దీప్తి, డైరెక్టర్ శుభ గారు మొదటి నుంచి సినిమాను నమ్మారు. సినిమా కోసం కష్టపడుతున్నారు. ఇప్పటికీ అదే నమ్మకంతో ప్రమోషన్స్ చేస్తున్నారు. వాళ్ల నమ్మకం థియేటర్స్ లో నిజం కావాలి. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.

జుబేదా అలీ మాట్లాడుతూ : ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కికులో ఒక హీరోతో పాటు ఒక విలన్, ఒక కమెడియన్ కనిపించారు. ఈ చిత్ర కథ ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఈ సినిమా కోసం హీరో కికు, ప్రొడ్యూసర్ దీప్తి చాలా కష్టపడ్డారు. వాళ్లకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.

యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ : చిన్న సినిమాను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. ఓటీటీలో కాకుండా థియేటర్స్ లో ఈ సినిమాను చూడమని కోరుతున్నా. కికు, దీప్తి ఈ చిత్రాన్ని ఇష్టపడి కష్టపడి చేశారు. ఇలాంటి వాళ్లను సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు చేస్తారు. అన్నారు.

ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ : ఇటీవల థియేటర్స్ కు ప్రేక్షకులు బాగా వస్తున్నారు. చిన్న చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. కికు, దీప్తి ఎన్నో అడ్డంకులు దాటుకుని తమ సినిమాను రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను కూడా మీరు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ శుభ సాయి వెంకట్ మాట్లాడుతూ : మా సినిమాకు వచ్చిన ఇబ్బందులు సాల్వ్ అయ్యేలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరుపున మా ప్రసన్న గారు సహకారం అందించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ కథలో ఒక డేరింగ్ రిస్కీ ఎలిమెంట్ ఉంది. అది ట్రైలర్ లో చూపించలేదు. అలాంటి రిస్కీ పాయింట్ ను నమ్మి మా ప్రొడ్యూసర్స్ సినిమా చేశారు. కథను నమ్మి నిలబడ్డారు. వారి కోసం మా మూవీ హిట్ కావాలి. ఈ నెల 28న మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ దీప్తి నడిమింటి మాట్లాడుతూ : ఒక మంచి సినిమా చేశామనే నమ్మకంతో మేమంతా ఉన్నాం. సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఈ నెల 28న ధైర్యంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. మీరు థియేటర్స్ కు రండి ఎక్కడా డిజప్పాయింట్ అవరు. ప్రొడ్యూసర్స్ గా నా గ్యారెంటీ అది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆమె మా మూవీ ప్రమోషన్స్ కి రాకపోవడం బాధాకరం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మాకు సహకారం అందించిన ప్రసన్నకుమార్ గారికి, సినిమా మేకింగ్ టైమ్ లో సపోర్ట్ చేసిన ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

హీరో కికు యనమల మాట్లాడుతూ : మా సినిమా ఈవెంట్ కోసం టైమ్ కేటాయించి మా కోసం వచ్చిన అతిథులకు థ్యాంక్స్ చెబుతున్నాం. మా చిత్రంలో అవకాశాన్ని ముఖ్యమని భావించి పనిచేసి ఇప్పుడు ప్రమోషన్స్ కు కూడా రాని వాళ్లను చూస్తుంటే బాధగా ఉంది. మా సినిమా ప్రమోషన్ ను ఏపీలోని పలు ప్రాంతాల్లో చేశాను. అక్కడ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. హైదరాబాద్ లో ఒక కాలేజ్ వాళ్లు మాత్రం ఈవెంట్ కు పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దాంతో మాకు సమయం వృథా అయ్యింది. కొన్ని థియేటర్స్ లో మా సినిమా ఫ్లెక్సీలను తీసేసి మరో పెద్ద సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు. అది డబ్బింగ్ మూవీ. ఆ సినిమాకు ప్రాధాన్యత ఇవ్వండి తప్పు లేదు కానీ మన స్ట్రైట్ తెలుగు సినిమాను ఎందుకు సపోర్ట్ చేయరు అని అడుగుతున్నా. మన సినిమాలకు పక్క రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇవ్వరు, సపోర్ట్ చేయరు. ఇక్కడ తెలుగులో కూడా తెలుగు సినిమాకు సహకరించకుంటే ఎలా. ఎవరు సపోర్ట్ చేయకున్నా మేము భయపడము. మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. తమ సినిమాల మీద నమ్మకం ఉన్న కొత్త వాళ్లు ఎవరైనా భయపడకుండా ఇండస్ట్రీకి రండి. మీ కంటెంట్ మిమ్మల్ని నిలబెడుతున్నా. ప్రసన్న గారు, ఛోటా కె ప్రసాద్ లాంటి వాళ్లు మా సినిమాకు ఎంతో సహకారం అందించారు. ఈ నెల 28న థియేటర్స్ లోకి వస్తున్న మా చిరంజీవి సినిమా ఒక కొత్త కాన్సెప్ట్ తో మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అన్నారు.

నటీనటులు – కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, గిరీష్, తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *