‘మోతెవరి లవ్ స్టోరీ’ విజువల్స్ చూస్తే అరుపులే..

ఇటీవలి కాలంలో తెలంగాణ యాసలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ‘మై విలేజ్ షో’ ఎంతో పాపులర్ అవడంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే వెబ్ సిరీ‌స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఈ సిరీస్‌కు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా.. శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పని చేశారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌‌‌ ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు మెగా ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరీస్‌లోని మొదటి నాలుగు ఎపిసోడ్‌లను ప్రత్యేక ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కందకట్ల సిద్దు మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ టీంకు కంగ్రాట్స్. ఇది సిరీస్‌‌లా కాకుండా సినిమాలా అనిపించింది. డీఓపీ పేరులో అరుపుల అని ఉంది. విజువల్స్ చూస్తే అరుపులే. చరణ్ అర్జున్ గారి పాటలు, బీజీఎం అద్భుతంగా అనిపించాయి. ఫోన్ నుంచి జర్నీ స్టార్ చేసిన మై విలేజ్ షో టీం ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. అనిల్, వర్షిణి, మాన్సీ ఇలా అందరూ చక్కగా నటించారు. ‘బలగం’ రేంజ్‌లో ‘మోతెవరి లవ్ స్టోరీ’ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ టీం చాలా కష్టపడింది. ఇలాంటి కథలను ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడానికి జీ5 టీం చాలా కష్టపడుతోంది. అనిల్, వర్షిణి అద్భుతంగా నటించారు. శివ ఇప్పటికీ సిరీస్‌ కోసం పని చేస్తూనే ఉన్నారు. సదన్నకు నేను పెద్ద అభిమానిని. చరణ్ అర్జున్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. మా జర్నీని ఒకేసారి ప్రారంభించాం’ అని అన్నారు. అనిల్ గీలా మాట్లాడుతూ .. ‘‘మా జర్నీ 8 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ స్థాయికి వస్తామని నేను అయితే అనుకోలేదు. శ్రీకాంత్ అన్న చెప్పినట్టుగా వచ్చే పదేళ్లలో ఆ స్థాయిలో ఉంటాం. తెరపై మా బొమ్మని చూసుకుంటే ఆనందంగా ఉంది. అందరం ప్రేమతో ఈ ప్రాజెక్ట్‌ని చేశాం. తీసుకున్న బడ్జెట్‌కి ఇచ్చిన అవుట్ పుట్‌కు జీ5 టీం సంతృప్తికరంగా ఉంది. మేం కన్న కలకు అందరం ఆయుధంగానే పని చేశాం. శివన్న ప్రతీ చిన్న డీటైల్‌ను మిస్ కాకుండా చూసుకునేవారు. మా అందరికీ ఇది మొదటి ప్రాజెక్ట్. మా శివన్నతో సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తాం. మామై విలేజ్ షోటీంను మరింత ముందుకి తీసుకెళ్తాం. శ్రీకాంత్, శివన్న, నేను ముగ్గురం త్రిమూర్తుల్లా పని చేశాం. నాకుప్రయాణంలో సపోర్ట్ చేసిన నా భార్య ఆమనికి థాంక్స్. మా లాంటి కొత్త వారికి మీడియా సపోర్ట్ ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సకుటుంబ సమేతంగా అందరూ కూర్చుని హాయిగా చూసుకునేలా మా సిరీస్ ఉంటుంది. ఆగస్ట్ 8న మా సిరీస్ జీ5లో రాబోతోంది’’ అని అన్నారు.

చరణ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’తో అనిల్, శివన్న, సదన్న, రాజన్న ఇలా అందరూ హీరోలు అవుతున్నారు. శ్రీధర్ గారు నాకు మెంటర్‌లాంటి వారు. స్టైల్ చిత్రంలో మెరుపై సాగరా అనే పాటను రాశాను. గెలుపు కోసం పోరాడే వీరులకు ఆయుధంగా ఉండాలని ఈ సిరీస్‌లోకి వచ్చాను. అనిల్, వర్షిణి జంట అందరినీ ఆకట్టుకుంది. శ్రీకాంత్ విజువల్స్, నా పాట ఇన్నాళ్లకు సెట్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు. శ్రీకాంత్ అరుపుల మాట్లాడుతూ .. ‘పగలు రాత్రి తేడా లేకుండా ఈ సిరీస్‌ కోసం అందరం పని చేశాం. అనిల్, శివ, నేను గత వారం నుంచి నిద్ర కూడా పోవడం లేదు. ఈ స్టోరీతో మేమంతా కనెక్ట్ అయిపోయాం. ఎలాగైనా సరే విజయం సాధించాలని కసితో పని చేశాం’’ అన్నారు. నటుడు సదన్న మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మి మంచి పాత్రను ఇచ్చిన శివ, అనిల్‌కు థాంక్స్. మధుర శ్రీధర్, శ్రీకాంత్, జీ5 టీంకు థాంక్స్. ఈ సిరీస్ మరింతగా సక్సెస్ అవ్వాలని, అందరినీ మరింతగా ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నటి మాన్సీ మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’లో అవకాశం ఇచ్చిన శివ అన్నకి థాంక్స్. ఎక్కడా కూడా గ్లిజరన్ వాడుకుండా నటించాం. నా కుక్క చచ్చిపోయిందని చెప్పి నాతో ఎమోషనల్ సీన్స్ చేయించారు. ఆ తరువాత సీన్లన్నీ కూడా ఏడుస్తూనే చేశా. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *